తుడిచిపెట్టుకుపోతున్న మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌

తుడిచిపెట్టుకుపోతున్న మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌

స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఈ వారం ఓ పీడకలగా మిగిలిపోనుంది.మిడ్ క్యాప్ కంపెనీలు దాదాపు 90 శాతం వరకూ పతనం చవిచూడటంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.మిడ్ క్యాప్ ఇండెక్స్ లో నమోదైన 105 స్టాక్స్‌లో 82 స్టాక్స్ 20శాతం నుండి 90 శాతం వరకూ పడిపోయాయి. మార్కెట్లో తలెత్తిన బేరిష్ నెస్ ప్రభావంతోనే ఈ పతనం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. BSEలో నమోదైన 869 స్మాల్ క్యాప్ కంపెనీల్లో 825 కంపెనీల స్టాక్స్ దారుణంగా పడిపోయాయి. దాదాపు 352 స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లు 50 శాతం దిగువకు క్షీణించాయి. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కూడా ఈ పతనంలో భాగం అయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన యూనియన్ బ్యాంక్, , బ్యాంక్ ఆఫ్ ఇండియా, NBCC , సెంట్రల్ బ్యాంక్‌ల షేర్లు 60 శాతం పడిపోయాయి.   BSCలోని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు 21-32 శాతం నష్టాల పాలయ్యాయని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొన్నారు.కాగా బ్లూచిప్ సెన్సెక్స్ లో మాత్రం కేవలం 9.5 శాతం మాత్రమే కోల్పోయాయి. ఇది గత ఆగస్ట్‌ నెలకు గరిష్టంగా ఉంది.
90 శాతం పడిపోయిన పలు కంపెనీల షేర్లు...
వివాదాలతో సతమతమౌతున్న కంపెనీలైన PC జ్యూయల్లరీస్, జేపీ ఇన్ఫ్రా, రోల్టా ఇండియా, 8K మైల్స్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ వంటి కంపెనీలు కూడా 80 శాతం పతనాన్ని చవిచూశాయి. మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ లలో అమ్మకాలు మరింత పెరగొచ్చు. BSE మిడ్ క్యాప్ రంగంలో యూనియన్ బ్యాంక్ షేర్లు 65.5 శాతం పడిపోగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు..63.7 శాతం పడిపోయాయి. సెంట్రల్ బ్యాంక్, రిలయన్స్ పవర్ కంపెనీల షేర్లు వరసగా 61, 60 శాతం పతనమయ్యాయి. ఇక BSE స్మాల్ క్యాప్ రంగంలో JBF ఇండస్ట్రీస్ గరిష్టంగా 91.3 శాతం పతనమైంది. పీసీ జ్యూయల్లెర్స్ 90.7 శాతం పడిపోగా క్వాలిటీ, జేపీ ఇన్ఫ్రా టెక్, రోల్టా ఇండియా షేర్లు   వరుసగా 90.4, 90, 84.5 శాతం పడిపోయాయి. డొమెస్టిక్ ఇన్వెస్టర్లకు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు 2013లో భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. 2007 వరకూ బాగానే ఉన్న ఈ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు డిమానిటైజేషన్, జీఎస్టీ ప్రభావానికి గురయ్యాయి. ఒకానొక దశలో ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో  విషయంలో సెన్సెక్స్ తో పోటీ పడి మరీ పరుగులు పెట్టాయి.  బోర్డర్ మార్కెట్స్ క్షీణతను నమోదు చేయడంతో 2018 జనవరి నుండి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు...ఇన్వెస్టర్లకు చేదు మాత్రలుగా మారిపోయాయి. ఆయా రంగాల్లో ఆశావహ దృక్పథంతో ఉన్న ఇన్వెస్టర్ల ఆశల మీద సెబీ నిర్ణయాలు కూడా నీళ్ళు చల్లినట్టైంది.

 Most Popular