ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు నష్టాల బీపీ!

ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు నష్టాల బీపీ!

గత వారం ఉన్నట్టుండి పతనబాట పట్టిన ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలకు ఎగబడుతున్నారు. దీంతో పలు హౌసింగ్‌ ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల కౌంటర్లు నష్టాలవైపు ప్రయాణిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా డౌన్‌ సర్క్యూట్‌ను తాకుతూ వస్తున్న ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ మరోసారి 5 శాతం పతనంకాగా.. కేన్‌ఫిన్‌ హోమ్‌, రెప్కో హోమ్‌ తదితర కౌంటర్లోనూ తాజాగా అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్ని  షేర్లు ఏడాది కనిష్టాలకు చేరాయి. వివరాలు చూద్దాం..

పతన బాటలో
లిక్విడిటీ భయాలతో ఇటీవల ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లలో అమ్మకాలకు క్యూకట్టిన సంగతి తెలిసిందే. అయితే గత వారం కొన్ని కౌంటర్లు కోలుకున్నప్పటికీ నేటి ట్రేడింగ్‌లో మరోసారి వీటికి అమ్మకాల సెగ తగులుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దివాన్‌ హౌసింగ్‌ షేరు 7.6 శాతం నీరసించి రూ. 293 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 291ను తాకింది. ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ 5 శాతం కోల్పోయి రూ. 462 వద్ద ఫ్రీజయ్యింది. ఈ బాటలో జీఐసీ హౌసింగ్‌ 4 శాతం తిరోగమించి రూ. 256 వద్ద ట్రేడవుతోంది. రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ తొలుత రూ. 399 వరకూ జారింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. ప్రస్తుతం 4.3 శాతం నష్టంతో రూ. 401 వద్ద ట్రేడవుతోంది. కేన్‌ఫిన్‌ హోమ్‌ 5 శాతం పతనమై రూ. 239 వద్ద ట్రేడవుతోంది. ఇదే విధంగా బజాజ్‌ ఫైనాన్స్‌ 4 శాతం నష్టపోయి రూ. 2148 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2123 వరకూ వెనకడుగు వేసింది.  

Image result for calculations
నేలచూపులో 
ఫైనాన్షియల్‌ సేవలు అందిస్తున్న ఇతర కౌంటర్లలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.4 శాతం తక్కువగా రూ. 5617 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 5576 వరకూ వెనకడుగు వేసింది. ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ 2 శాతం నష్టంతో రూ. 250 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 245 వరకూ నీరసించింది. నేలచూపులతో కదులుతున్న ఇతర కౌంటర్లలో ఇక ఇండియాబుల్స్ హౌసింగ్‌ 2.5 శాతం తిరోగమించింది. రూ. 920 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 897 వరకూ దిగజారింది. కేపిటల్‌ ఫస్ట్‌ 2 శాతం నష్టంతో రూ. 494కు చేరగా... శ్రేఈ ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ 2 శాతం బలహీనపడి రూ. 35 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 33 వరకూ నీరసించింది. రిలయన్స్‌ కేపిటల్‌ 1.2 శాతం వెనకడుగుతో రూ. 274 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 269 వరకూ క్షీణించింది.  మణప్పురం ఫైనాన్స్‌ 2.3 శాతం క్షీణించి రూ. 73ను తాకగా.. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ 1.5 శాతం తిరోగమించి రూ. 126కు చేరింది. ఇంట్రాడేలో రూ. 124ను తాకింది. Most Popular