IL&FS పతనానికి కారణమెవరు?

IL&FS పతనానికి కారణమెవరు?

తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి, కంపెనీ టేకోవర్ జరిగిపోయాక తీరిగ్గా ఒకరి పై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు IL&FS మాజీ డైరెక్టర్లు. ఇలా జరిగి ఉండకపోతే బాగుండు అని ఇప్పుడు కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారు కంపెనీ మాజీ బోర్డు సభ్యులు. పేరు చెప్పడానికి ఇష్టపడని మాజీ డైరెక్టర్ ఒకరు మీడియా తో మాట్లాడుతూ IL&FS కంపెనీ చెల్లింపుల్లో జాప్యం జరిగినపుడే.. సంస్థను వేరే వారికి అమ్మకానికి పెడదామని సూచించామని... కానీ కొందరు పెద్దలు, మేజర్ షేర్ హోల్డర్స్ ఒప్పుకోలేదని వాపోయారు.


టేకోవర్ చేసుకుందామనుకున్న పిరమాల్
తొలుత IL&FS కంపెనీ ఆస్తులను చూసి పిరమాల్ కంపెనీ టేకోవర్‌కు ముందుకు వచ్చింది. కానీ... బోర్డులో కొందరు అభ్యంతరం తెలపడంతో ఆ ప్రతిపాదన మరుగున పడిపోయింది.  IL&FS సంస్థకు  తొలి నాళ్ళలో గట్టి సపోర్ట్ ఇచ్చిన LIC, SBI రెండు తరువాత తరువాత మొహం చాటెయ్యడం మొదలెట్టాయి.

గత మాసం ఆరంభంలో కూడా LIC దాదాపు రు. 15,000 కోట్ల పెట్టుబడులను పెట్టడానికి ముందుకు వచ్చింది. కానీ SBI  బ్యాంకు మాత్రం IL&FSను డిఫాల్డ్ కంపెనీ గా  పేర్కొనడం, రేటింగ్ సంస్థలు కూడా IL&FS  రేటింగ్ తగ్గించడంతో LIC వెనక్కి తగ్గింది. కమర్షియల్ బాండ్ పేపర్ల అమ్మకాలు జరగక ముందు ఇదే LIC, SBI పెట్టుబడులు పెట్టి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదని మాజీ బోర్డు డైరెక్టర్లు అంటున్నారు.



Most Popular