ఝున్ ఝున్ వాలాకు ఝలక్....

ఝున్ ఝున్ వాలాకు ఝలక్....

మార్కెట్ క్రాష్ వల్ల రిటైల్ పెట్టుబడుదారులే కాకుండా , PMS మేనేజర్లు, వారి హై వాల్యూ క్లైయింట్లు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.  ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్ , హై పోర్ట్ ఫోలియో కలిగిన రాకేష్ జున్ జున్ వాలా తన మిడ్ క్యాప్ హోల్డింగ్స్ లో దాదాపు 75శాతం నష్టపోవడం కలకలం రేపింది. గత నాలుగు సంవత్సరాలు గా మిడ్ క్యాప్ షేర్లు నిలకడగా పెరిగాయి. BSE గణాంకాల ప్రకారం 2014 సంవత్సరంలో 55 శాతం, 2015లో 7.04శాతం , 2016లో 8 శాతం, 2017లో 48శాతం మిడ్ క్యాప్ షేర్లు పెరిగాయి. కానీ ఈ సంవత్సరం మార్కెట్ క్యాప్, మ్యూచువల్ ఫండ్స్‌ను    పునర్‌నిర్వచించడంతో ఒక్కసారిగా మార్కెట్ క్రాష్ కు గురైంది. మిడ్ క్యాప్ కంపెనీలపై ఓవర్ వాల్యూషన్స్ పెరగడంతో ఒత్తిళ్ళకు గురైయ్యాయి.  సుదీర్ఘ కాలం స్టాక్స్ ను హోల్డ్ చేసిన ఘనత కలిగిన రాకేష్ ఝన్ ఝున్ వాలా పోర్ట్ ఫోలియోలో లోని స్టాక్స్  ఒక్కసారిగా 75శాతం నష్టపోవడంతో పోర్ట్ ఫోలియో వాల్యూ రు.10,000కోట్ల కిందకి చేరింది.
కాపాడినవి మూడు మాత్రమే...
ముఖ్యంగా  ఝున్ ఝున్ వాలా పోర్ట్ ఫోలియోలోఉన్న 27 స్టాక్స్ లో  ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, VIP ఇండస్ట్రీస్ , ల్యూపిన్ స్టాక్స్ వరుసగా 51శాతం, 17.63 శాతం, 1.8శాతం లాభాల బాటలో ఉండగా మిగతా అన్ని స్టాక్స్ 75 శాతానికి పడిపోవడంతో నికర పోర్ట్ ఫోలియో విలువ అడుగంటింది.


నష్టపరిచిన షేర్లు
రాకేష్ వద్ద నున్న మందన రిటైల్స్ వెంచర్స్ స్టాక్స్ 75శాతానికి పడిపోయాయి. జయప్రకాష్ అసోసియేట్స్ 74.16 శాతానికి పడిపోయాయి. DB రియాలిటీ 63 శాతం, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 61 శాతం, ఆప్ టెక్ 58 శాతం , ప్రోజోన్ ఇన్ టూ ప్రోపర్టీస్ 58 శాతం, DHFL 53 శాతం , బిల్ కేర్ 51 శాతం నష్టపోవడంతో రాకేష్ పోర్ట్ ఫోలియో కుదుపులకు లోనైంది. మిగత స్టాక్స్ అయిన ఓరియంట్ సిమెంట్స్, TV18 బ్రాడ్ కాస్ట్, ప్రకాష్ ఇండస్ట్రీస్ , మ్యాన్ ఇన్ఫ్రా , అటోలైన్ ఇండస్ట్రీస్ ,ఫెడరల్ బ్యాంక్, కరూర్  వైశ్యా బ్యాంక్ , డెల్టా గ్రూప్ షేర్లు 30- 50 శాతానికి పడిపోవడంతో రాకేష్ జున్ జున్ వాలా నష్టపోయారు.
ఇక ఈ మార్కెట్ క్రాష్  పెద్ద పెద్ద పెట్టుబడి దారుల సంపద ఆవిరైపోడానికి కారణంగా మారుతుంది. క్లోనింగ్ పోర్ట్
ఫోలియోలు, ఐకానిక్ ఇన్వెస్టర్ల రాబడికికి ఇక ఏ మాత్రం చిరునామాలుగా ఉండబోవు.Most Popular