ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ నష్టాల లిస్టింగ్‌!

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ నష్టాల లిస్టింగ్‌!

ఇటీవలే విజయవంతంగా పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో నీరసంగా లిస్టయ్యింది. ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ఇర్కాన్‌ ఐపీవో ధర రూ. 475 కాగా... బీఎస్‌ఈలో రూ. 65 నష్టంతో రూ. 410 వద్ద లిస్టయ్యింది. ఇది ఇంట్రాడే కనిష్టంకాగా..  ప్రస్తుతం ఈ స్థాయి నుంచి కాస్త కోలుకుని అంటే  7.5 శాతం పెరిగి రూ. 441 వద్ద ట్రేడవుతోంది. ఈ నె19న ముగిసిన ఇష్యూకి దాదాపు 10 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్ లభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం 10 శాతం వాటాకు సమానమైన 99 లక్షలకుపైగా షేర్లను విక్రయించింది. తద్వారా రూ. 470 కోట్లు సమకూర్చుకుంది. 

ఇంజినీరింగ్ సంస్థ
ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంజినీరింగ్‌, నిర్మాణ రంగ సంస్థ. మౌలిక సదుపాయాల రంగంలో సమీకృత కార్యకలాపాలు చేపట్టగల కంపెనీ 1976లో ప్రారంభమైంది. రైల్వేలు, జాతీయ రహదారులు, బ్రిడ్జిలు, సొరంగ మార్గాలు, ఈహెచ్‌వీ సబ్‌స్టేషన్లు తదితర పలు ప్రధాన ప్రాజెక్టులను పూర్తిచేసింది. అంతేకాకుండా వాణిజ్య, రెసిడెన్షియల్ ఆస్తులను సైతం అభివృద్ధి చేసింది. 2018 మార్చికల్లా కంపెనీ ఆర్డర్‌ బుక్‌ విలువ రూ. 22,406 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఆదాయంలో రైల్వే ప్రాజెక్టుల వాటా దాదాపు 69 శాతంకావడం ప్రస్తావించదగ్గ అంశం.  మౌలిక రంగంలో ఇకపైన కూడా రైల్వేలు, రహదారులు, ఫ్లేఓవర్లు తదితర పలు ప్రాజెక్టులకు అవకాశాలున్నట్లు కంపెనీ చైర్మన్‌ సునీల్‌ కుమార్‌ చౌదరి పేర్కొన్నారు. కంపెనీలో ఐపీవోకు ముందు ప్రభుత్వానికి 99.69 శాతం వాటా ఉంది. ఐపీవో ద్వారా 10 శాతం వాటాను విక్రయించింది.

Related image

ఆర్థిక పనితీరు 
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గత రెండేళ్లలో కంపెనీ ఆదాయం వార్షికంగా 27 శాతం వృద్ఢిని సాధించింది. నికర లాభం మాత్రం 2 శాతం స్థాయిలో పెరిగింది. సగటున నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు దాదాపు 11 శాతం చొప్పున నమోదుకాగా.. 10.3 శాతం రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌వోఈ) సాధించింది. కంపెనీకి రుణభారంలేకపోగా.. 2018 మార్చికల్లా రూ. 4691 కోట్లమేర నగదు, తత్సమాన నిల్వలు కలిగి ఉంది.Most Popular