నేటి నుంచి దినేష్‌ ఇంజినీర్స్‌ ఐపీవో 

నేటి నుంచి దినేష్‌ ఇంజినీర్స్‌ ఐపీవో 

ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల(ఓఎఫ్‌సీ) సంస్థ దినేష్‌ ఇంజినీర్స్‌ పబ్లిక్‌ ఇష్యూ నేటి(28) నుంచి ప్రారంభంకానుంది. అక్టోబర్‌ 3న ముగియనున్న ఇష్యూకి ప్రైస్‌-బ్యాండ్‌ షేరుకి రూ. 183-185గా కంపెనీ నిర్ణయించింది. తద్వారా రూ. 185 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా కోటి షేర్లను విక్రయానికి ఉంచనుంది. నిధులను ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌ విస్తరణ, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 

80 షేర్లు ఓక లాట్‌
రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 80 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా షేర్లను కొనుగోలుచేయాలని భావిస్తే రూ. 2 లక్షల మొత్తానికి మించకుండా ఓకే లాట్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 

కంపెనీ వివరాలివీ
2006లో ప్రారంభమైన కంపెనీ ప్రధానంగా టెలికం ఆపరేటర్లు, ఇంటర్నెట్‌ ప్రొవైడర్లకు అవసరమయ్యే కమ్యూనికేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీసులను అందిస్తోంది. టెలికం కంపెనీలు, ఇంటర్నెట్‌ సంస్థల నుంచి ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు ఆర్డర్లను పొందుతోంది. కంపెనీ కస్టమర్లలో ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్ తదితర దిగ్గజాలున్నాయి. ఐపీ-1 లైసెన్స్‌ను పొందిన కంపెనీ ఇందుకు అనుగుణంగా 7,500 కిలోమీటర్ల ఆప్టిక్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను సొంతగా ఏర్పాటు చేసుకుంది. రాజస్తాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు.. తెలంగాణలోనూ నెట్‌వర్క్‌ను విస్తరించింది. 2011 నుంచీ వివిధ కస్టమర్ల అవసరాలను అనుసరించి కంపెనీ 9,500 కిలోమీటర్లమేర ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది.Most Popular