మళ్లీ ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ పతనం!

మళ్లీ ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ పతనం!

గత వారం ఉన్నట్టుండి పతనబాట పట్టిన ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలకు ఎగబడుతున్నారు. దీంతో పలు హౌసింగ్‌ ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలతోపాటు రియల్టీ కౌంటర్లు సైతం భారీ నష్టాలవైపు ప్రయాణిస్తున్నాయి. వారాంతాన ఒక్కసారిగా కుప్పకూలిన దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌సహా యస్‌ బ్యాంక్‌ కౌంటర్లోనూ తాజాగా అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్ని  షేర్లు ఏడాది కనిష్టాలకు చేరాయి. వివరాలు చూద్దాం..

పతన బాటలో
లిక్విడిటీ భయాలతో గత వారాంతాన ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లలో అమ్మకాలకు క్యూకట్టిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజుల్లో కొన్ని కౌంటర్లు కోలుకున్నప్పటికీ నేటి ట్రేడింగ్‌లో మరోసారి ఈ కౌంటర్లకు అమ్మకాల సెగ తగులుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దివాన్‌ హౌసింగ్‌ షేరు 3.2 శాతం నీరసించి రూ. 296 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 291ను తాకింది. ఇక ఇండియాబుల్స్ హౌసింగ్‌ 5 శాతం తిరోగమించింది. రూ. 949 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ.928 వరకూ దిగజారింది. ప్రయివేట్‌ రంగ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ సైతం 6 శాతం పతనమై రూ. 210 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 207 వరకూ క్షీణించింది. బీఎస్‌ఈలో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ 9.4 శాతం పతనమై రూ. 192 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 185 వరకూ నీరసించింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం! 

Image result for down

నష్టాల జాబితాలో
నేలచూపులతో కదులుతున్న ఇతర కౌంటర్లలో ఇండియాబుల్స్‌ రియల్టీ 8 శాతం కుప్పకూలింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రూ. 104 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 99 వరకూ జారింది. ఈ బాటలో హెచ్‌డీఐఎల్‌, డీఎల్‌ఎఫ్‌ 5 శాతం చొప్పున దిగజారాయి. ఇతర కౌంటర్లలో రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ తొలుత రూ. 409 వరకూ జారింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. ప్రస్తుతం 4 శాతం నష్టంతో రూ. 423 దిగువన ట్రేడవుతోంది. ఈ బాటలో కేన్‌ఫిన్‌ హోమ్‌ 6.5 శాతం పతనమై రూ. 232 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 230 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఇదే విధంగా బజాజ్‌ ఫైనాన్స్‌ 2.6 శాతం నష్టపోయి రూ. 2257 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2241 వరకూ వెనకడుగు వేసింది. ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ 4 శాతం పతనమై రూ. 271 వద్ద కదులుతోంది.  

Image result for investors disappointed

ఏడాది కనిష్టాలకు
ఫైనాన్షియల్‌ సేవలు అందిస్తున్న ఇతర కౌంటర్లలో కేపిటల్‌ ఫస్ట్‌ దాదాపు 4 శాతం నష్టంతో రూ. 500కు చేరగా... ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ 5 శాతం కోల్పోయి రూ. 567 వద్ద ఫ్రీజయ్యింది. ఇదే విధంగా జీఐసీ హౌసింగ్‌ 2.5 శాతం తిరోగమించి రూ. 260 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 256 దిగువన ఏడాది కనిష్టాన్ని తాకింది. శ్రేఈ ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ 11 శాతం బలహీనపడి రూ. 36 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 35 దిగువన ఏడాది కనిష్టానికి చేరింది. రిలయన్స్‌ కేపిటల్‌ 6.2 శాతం పతనమై రూ. 298 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 295 దిగువన ఏడాది కనిష్టాన్ని తాకింది.  మణప్పురం ఫైనాన్స్‌ 2 శాతం వెనకడుగుతో రూ. 78ను తాకగా.. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ 1 శాతం తిరోగమించి రూ. 131కు చేరింది. పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ 0.6 శాతం నష్టంతో రూ. 15 వద్ద కదులుతోంది. Most Popular