గార్డెన్‌ రీచ్‌ షిప్‌ ఐపీవో గడువు పొడిగింపు!

గార్డెన్‌ రీచ్‌ షిప్‌ ఐపీవో గడువు పొడిగింపు!

సోమవారం(24న) నుంచి ప్రారంభమైన ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌(జీఆర్‌ఎస్‌ఈ) లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ ముగింపు గడువును ప్రభుత్వం మూడు రోజులపాటు పొడిగించింది. దీంతోపాటు ప్రైస్‌బ్యాండ్‌ను సైతం సవరించింది. బుధవారం(26న) ముగియాల్సిన ఇష్యూ తాజాగా అక్టోబర్‌ 1(సోమవారం)వరకూ కొనసాగనుంది. తొలుత నిర్ణయించిన ప్రైస్‌-బ్యాండ్‌ రూ. 115-118ను ప్రభుత్వం తాజాగా రూ. 114-118గా సవరించింది. తద్వారా రూ. 340 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 2.92 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. బుధవారానికల్లా 1.97 కోట్ల షేర్లకు మాత్రమే బిడ్స్‌ దాఖలుకావడంతో ప్రభుత్వం గడువు పొడిగింపును చేపట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు.

Image result for IPO

120 షేర్లు ఒక లాట్‌
మినీరత్న కంపెనీ (జీఆర్‌ఎస్‌ఈ) లిమిటెడ్‌ ఐపీవోలో భాగంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 120 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షల విలువకు మించకుండా ఒకే లాట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కంపెనీ బ్యాక్‌గ్రౌండ్‌
కేంద్ర ప్రభుత్వం ప్రమోట్‌ చేసిన జీఆర్‌ఎస్‌ఈ లిమిటెడ్‌ ప్రధానంగా దేశ నావికా దళం, తీరప్రాంత రక్షణ విభాగాలకు అవసరమయ్యే ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఆధునిక, వ్యూహాత్మర వార్‌షిప్పులను తయారు చేస్తోంది. వీటిలో ఫ్రైగేట్స్‌, ఫ్లీట్‌ ట్యాంకర్లు, సర్వే వెస్సల్స్‌, ఆఫ్‌షోర్‌, ఆన్‌షోర్‌ ప్యాట్రోల్‌ వెస్సల్స్‌, హోవర్‌ క్రాఫ్ట్స్‌ తదితరాలను రూపొందిస్తోంది. అంతేకాకుండా పోర్టబుల్‌ ప్రీఫ్యాబ్రికేటెడ్‌ స్టీల్‌ బ్రిడ్జిలు, మెరైన్‌ పంపులు, డీజిల్‌ ఇంజిన్లు, వార్‌షిప్పులకు అవసరమయ్యే డెక్ మెషీనరీలను సైతం తయారు చేస్తోంది. కంపెనీ ప్రస్తుత ఆర్డర్‌ బుక్‌ విలువ రూ. 20,803 కోట్లుకాగా.. దేశ నావికాదళం నుంచే దాదాపు 99 శాతం ఆర్డర్లు లభించినట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. Most Popular