ఏవియేషన్‌కు చమురు ధరల సెగ!

ఏవియేషన్‌కు చమురు ధరల సెగ!

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరగడంతో ఏవియేషన్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇండిగో బ్రాండు విమాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌ కౌంటర్లు ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీలాపడ్డాయి. ప్రస్తుతం బీఎస్ఈలో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్ షేరు దాదాపు 5 శాతం పతనమైంది. రూ. 44 క్షీణించి రూ. 862 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 851 వరకూ పడింది. ఈ బాటలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు మరింత అధికంగా 6.3 శాతం తిరోగమించింది. రూ. 216 దిగువన ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 212 వరకూ పతనమైంది. ఇక స్పైస్‌జెట్‌ షేరు సైతం దాదాపు 5 శాతం నీరసించి రూ. 73.50 వద్ద కదులుతోంది. తొలుత రూ. 73.50 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. 

Image result for oil marketing companies

చమురు ధరలు అప్‌
లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ తాజాగా 80 డాలర్లను అధిగమించింది. ఇదేవిధంగా న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు బ్యారల్‌ 72 డాలర్లను తాకింది. దీంతో దేశీయంగా ఇప్పటికే రెక్కలొచ్చిన పెట్రో ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఇది ఏవియేషన్‌ కంపెనీలు వినియోగించే ముడిసరుకు ఏటీఎఫ్‌ ధరలను మండించనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా విమానయాన కంపెనీల లాభదాయకతకు చిల్లుపడనున్న అంచనాలు పెరుగుతున్నాయి. కాగా.. మరోపక్క పెట్రో ఉత్పత్తుల మార్కెటింగ్‌ కంపెనీల మార్జిన్లు సైతం బలహీనపడే అవకాశముంది. దీంతో ప్రభుత్వ రంగ రిఫైనింగ్‌ దిగ్గజాల కౌంటర్లలోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌పీసీఎల్‌ షేరు 4 శాతం పతనమై రూ. 248 దిగువకు చేరగా..  బీపీసీఎల్‌ 2 శాతం బలహీనపడి రూ. 369ను తాకింది. ఇక ఐవోసీ 1.5 శాతం వెనకడుగుతో రూ. 156 వద్ద ట్రేడవుతోంది. Most Popular