మదర్‌సన్ సుమీ, వక్రంగీ నేలచూపు

మదర్‌సన్ సుమీ, వక్రంగీ నేలచూపు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు ఆటో విడిభాగాల దిగ్గజం మదర్‌సన్ సుమీ కౌంటర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంటే.. కంపెనీ ఖాతా పుస్తకాలను తనిఖీ చేయవలసిందిగా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వెలువడటంతో వక్రంగీ లిమిటెడ్‌ కౌంటర్‌కు అమ్మకాల సెగ తగులుతోంది. వివరాలు చూద్దాం..  

మదర్‌సన్ సుమీ..
అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా దేశీ ఆటో రంగ విడిభాగాల తయారీ సంస్థ మదర్‌సన్ సుమీ సిస్టమ్స్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 9 శాతం పతనమై రూ. 252 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 250 వరకూ జారింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనీస్‌ దిగుమతులపై అమెరికా, 60 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికన్‌ ప్రొడక్టులపై చైనా సుంకాలు విధించిన సుంకాలు నేటి నుంచి అమలుకానున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా  కార్యకలాపాలు విస్తరించిన మదరస్‌సన్‌ సుమీ వంటి కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. 18 దేశాలలో 13 మాడ్యూల్‌ సెంటర్లు, 48 యూనిట్లను కలిగిన కంపెనీ ఆదాయంలో ఎగుమతులదే లో ప్రధాన వాటాకావడం గమనించదగ్గ అంశం. కంపెనీ టాప్‌-15 గ్లోబల్‌ కంపెనీలలో 14 సంస్థలకు వివిధ రకాల విడిభాగాలను సరఫరా చేస్తోంది.

Image result for vakrangee ltd

వక్రంగీ లిమిటెడ్‌
పశ్చిమ ప్రాంత రీజనల్‌ డైరెక్టర్‌ వక్రంగీ ఖాతాలపై ప్రాథమిక నివేదిక అందజేయడంతో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ తదుపరి మరింత కూలంకషంగా ఖాతాలను పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు వక్రంగీ కౌంటర్లో అమ్మకాలకు తెరతీశారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 9 శాతం పతనమై రూ. 33 వద్ద ట్రేడవుతోంది. ఆడిటర్‌ ప్రైస్‌ వాటర్‌హౌస్‌ మే నెలలో ఉన్నట్టుండి కంపెనీ ఆడిటింగ్ బాధ్యతల నుంచి వైదొలగడంపై రీజనల్‌ డైరెక్టర్‌ నివేదిక అందజేసినట్లు ఒక మీడియా పేర్కొంది. దీంతోపాటు ఫ్రాంచైజీల ద్వారా వసూలు చేసిన సొమ్ము వంటి అంశాలపై కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులపైనా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.Most Popular