ప్రభుత్వ చర్యలు రూపీ పతనాన్ని అడ్డుకుంటాయా?

ప్రభుత్వ చర్యలు రూపీ పతనాన్ని అడ్డుకుంటాయా?

రూపాయి పతనాన్ని అడ్డుకోడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తుంది. మార్కెట్‌లోకి పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడానికి తగు చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ తెలిపింది. గత జనవరి నుండి పదిశాతం క్షీణతతో రూపాయి డాలర్ మారకపు విలువతో పతనం కావడం తెలిసిందే.  కేంద్రం ప్రకటించిన పంచ సూత్రాల పథకం ప్రకారం రూపీ విలువను స్టేబుల్ చేయడానికి యత్నించవచ్చని ప్రముఖ పెట్టుబడుల సంస్థ మూడీ పేర్కొంది.


లోటు లక్ష్యాన్ని అధిగమిస్తాం...!
భారత ప్రభుత్వ అంచనా మేరకు మార్కెట్లో పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపు, మసాలా బాండ్లకు మినహాయింపులు వంటి చర్యలు రూపీ పతనాన్ని అడ్డుకోవచ్చని భావిస్తుంది. అలాగే భారతీయ బ్యాంకులను మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తూ... దాదాపు 8 నుంచి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటుంది. ఇది GDPలో 0.3-0.4 శాతంగా మార్చ్ 31,2019 కల్లా  ఉండవచ్చని అంచనా .ఈ ఆర్ధిక సంవత్సరం లోటును పూడ్చడం కోసం దిగుమతులను తగ్గించాలన్న  యోచనలో ఉంది. లోటు లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తన సంసిద్ధతను పునరుద్ఘాటించింది. ఈ ప్రభుత్వ చర్యలు భారతీయ బాహ్య ధన ఖాతాకు సానుకూల మద్దతు ఇచ్చినప్పటికీ కరెన్సీ తరుగుదలను నిరోధించడానికి అవకాశం లేదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.Most Popular