ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు అమ్మకాల షాక్‌

ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు అమ్మకాల షాక్‌

వరుసగా రెండో రోజు ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. దీంతో పలు హౌసింగ్‌ ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలతోపాటు రియల్టీ కౌంటర్లు సైతం భారీ నష్టాలవైపు ప్రయాణిస్తున్నాయి. వివరాలు చూద్దాం..

నేలచూపులతో
ప్రస్తుతం బీఎస్‌ఈలో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్స్‌ 11 శాతం కుప్పకూలి రూ. 211కు చేరగా..  ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ 7.25 శాతం పతనమై రూ. 985ను తాకింది. తొలుత రూ. 980 వరకూ జారింది. ఈ బాటలో రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ 7 శాతం పతనమై రూ. 430కు చేరగా, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ 6 శాతం తిరోగమించి రూ. 132ను తాకింది. మిగిలిన కౌంటర్లలో బజాజ్‌ ఫైనాన్స్‌ 6 శాతం నష్టపోయి రూ. 2243 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2171 వరకూ వెనకడుగు వేసింది. ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ 6 శాతం పతనమై రూ. 279కు చేరగా.. చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ సైతం 6 శాతం తిరొగమించి రూ. 1199 వద్ద కదులుతోంది. తొలుత రూ. 1190 వద్ద కనిష్టాన్ని తాకింది. 

Related image

ఇతర కౌంటర్లూ
ఫైనాన్షియల్‌ సేవలు అందిస్తున్న ఇతర కౌంటర్లలో ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ 4.25 శాతం క్షీణించి రూ. 394 వద్ద, కేపిటల్‌ ఫస్ట్‌ 5 శాతం నష్టంతో రూ. 522 వద్ద, ఎల్‌ఐసీ హౌసింగ్‌ 3.5 శాతం నీరసించి రూ. 423 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌ 4 శాతం నష్టంతో రూ. 15కు  చేరగా, మణప్పురం ఫైనాన్స్‌ 5 శాతం వెనకడుగుతొ రూ. 77ను తాకింది. ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ 5 శాతం కోల్పొయి రూ. 659 వద్ద, మ్యాగ్మా ఫిన్‌ 4 శాతం నష్టంతో రూ. 121 వద్ద, జీఐసీ హౌసింగ్‌ 4 శాతం తిరోగమించి రూ. 278 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక భారత్‌ ఫైనాన్షియల్‌ 4.2 శాతం నీరసించి రూ. 1045 వద్ద కేన్‌ఫిన్‌ 5.5 శాతం పడిపోయి రూ. 274 వద్ద,  శ్రేఈ ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ 3.3 శాతం బలహీనపడి రూ. 41 వద్ద కదులుతున్నాయి.   



Most Popular