మార్కెట్ల పతనబాట- రియల్టీ, ఆటో బేర్‌

మార్కెట్ల పతనబాట- రియల్టీ, ఆటో బేర్‌

గత వారాంతాన తగిలిన అమ్మకాల షాక్‌ నుంచి బయటపడని మార్కెట్లు మరోసారి డీలాపడ్డాయి. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే నష్టాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 306 పాయింట్లు పతనమై 36,535కు చేరగా.. నిఫ్టీ 101 పాయింట్లు నీరసించి 11,042 వద్ద ట్రేడవుతోంది. నేటి నుంచి అమెరికా, చైనా మధ్య దిగుమతి సుంకాలు అమల్లోకిరానున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. శుక్రవారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు లాభాలతో ముగియడం గమనార్హం! 

Image result for it employee

ఐటీ ఎదురీత
ఎన్‌ఎస్ఈలో ఐటీ మాత్రమే 2.3 శాతం బలపడగా.. మిగిలిన అన్ని రంగాలూ వెనకడుగులో ఉన్నాయి. రియల్టీ 4.5 శాతం, ఆటో 3.4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో..  బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ సైతం దాదాపు 1 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌, ఎంఅండ్ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, ఇండస్‌ఇండ్, ఐషర్, అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ 8.5-2.6 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, సిప్లా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ, వేదాంతా 3.2-1 శాతం మధ్య బలపడ్డాయి. 

Image result for Market down

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌లో దివాన్‌ హౌసింగ్‌ 10 శాతం జంప్‌చేయగా.. ఇన్ఫీబీమ్, జీఎంఆర్‌, ఐజీఎల్‌ 8-2.3 శాతం మధ్య ఎగశాయి. మరోపక్క మదర్‌సన్ సుమీ, ఐఆర్‌బీ, రెప్కో హోమ్‌, ఆర్‌కామ్‌,  జేపీ, చోళమండలం, డీఎల్‌ఎఫ్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, రిలయన్స్ కేపిటల్‌ 9.25-7 శాతం మధ్య పడిపోయాయి. రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్‌, ఒబెరాయ్‌, ఫీనిక్స్‌, శోభా, బ్రిగేడ్‌, ప్రెస్టేజ్‌ 7-2 శాతం మధ్య తిరోగమించాయి.

చిన్న షేర్లు పతనం
అమ్మకాలు పెరగడంతో మార్కెట్లను మించుతూ చిన్న షేర్లు పతనబాట పట్టాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 2 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1829 నష్టపోగా.. 527 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి.Most Popular