టీడీ పవర్‌, ఐటీడీ హైజంప్‌- సెంట్రల్‌ బ్యాంక్‌ పతనం

టీడీ పవర్‌, ఐటీడీ హైజంప్‌- సెంట్రల్‌ బ్యాంక్‌ పతనం

గత వారాంతాన పతనబాట పట్టిన కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కౌంటర్లో వరుసగా రెండో రోజు అమ్మకాలు ఊపందుకుఉన్నాయి.  మరోవైపు సొంత షేర్ల కొనుగోలు ప్రతిపాదన(బైబ్యాక్‌) అంచనాలతో శుక్రవారం జోరందుకున్న టీడీ పవర్‌ సిస్టమ్స్‌ కౌంటర్‌ వరుసగా రెండో రోజు భారీ లాభాలతో సందడి చేస్తోంది. ఇక తాజాగా ఆర్డర్ పొందన వార్తలతో ఐటీడీ సిమెంటేషన్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం.. 

టీడీ పవర్‌ సిస్టమ్స్‌
ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చిన టీడీ పవర్‌ సిస్టమ్స్‌ కౌంటర్‌ మళ్లీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. గత వారాంతాన 5 శాతం ఎగసిన ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో మరో 8 శాతం జంప్‌చేసింది. రూ. 126 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 17 శాతం దూసుకెళ్లి రూ. 135 వద్ద గరిష్టాన్ని తాకగా, రూ. 124 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. కాగా.. బైబ్యాక్‌ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల బుధవారం(26న) సమావేశంకానున్నట్లు టీడీ పవర్‌ పేర్కొంది.

Image result for central bank of india

సెంట్రల్‌ బ్యాంక్‌
శుక్రవారం భారీ ట్రేడింగ్‌ పరిమాణంతో 10 శాతం పతనమైన సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కౌంటర్లో ఇన్వెస్టర్లు మరోసారి భారీ అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 17 శాతంపైగా కుప్పకూలి రూ. 44 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 43 దిగువన 52 వారాల కనిష్టాన్ని తాకింది. వెరసి గత రెండు రోజుల్లోనే ఈ షేరు దాదాపు 30 శాతం తిరోగమించినట్లయ్యింది. 

Image result for itd cementation india ltd

ఐటీడీ సిమెంటేషన్‌
కేరళలోని త్రిచీస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో ఐటీడీ సిమెంటేషన్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం దాదాపు 5 శాతం జంప్‌చేసి 127 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 130 వరకూ ఎగసింది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, పోర్ట్‌బ్లెయిర్‌ జెట్టీ డెవలప్‌మెంట్ కన్సార్షియం ద్వారా రూ. 800 కోట్ల విలువైన ఆర్డర్‌ పొందినట్లు ఐటీడీ సిమెంటేషన్‌ పేర్కొంది.Most Popular