దివాన్‌ హౌసింగ్‌, ఉషా మార్టిన్‌ షైనింగ్‌

దివాన్‌ హౌసింగ్‌, ఉషా మార్టిన్‌ షైనింగ్‌

గత వారాంతాన భారీ అమ్మకాల కారణంగా కుప్పకూలిన గృహ రుణాల సంస్థ దివాన్‌  హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కౌంటర్‌ బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. మరోపక్క ప్రయివేట్‌ రంగ మెటల్‌ దిగ్గజం టాటా స్టీల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో ఉషా మార్టిన్‌ కౌంటర్‌ సైతం జోరందుకుంది. వివరాలు చూద్దాం...

దివాన్‌ హౌసింగ్‌ కార్ప్‌
అన్నివైపుల నుంచీ అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం 42 శాతం కుప్పకూలిన దివాన్‌ హౌసింగ్ కార్పొరేషన్‌ షేరు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే జోరుందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం దూసుకెళ్లింది. రూ. 420 సమీపంలో ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 438 వద్ద గరిష్టాన్నీ, రూ. 386 దిగువన కనిష్టాన్నీ తాకింది. కాగా.. 
డిఫాల్ట్‌ కాలేదు
దివాన్‌ హౌసింగ్‌ ప్రమోటర్ కపిల్‌ వాధ్వాన్‌ షేరు పతనంపై స్పందిస్తూ.. బాండ్లు లేదా ఏ ఇతర రుణ చెల్లింపుల్లోనూ కంపెనీ విఫలం(డిఫాల్ట్‌)కాలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు ఎలాంటి రుణాలనూ కంపెనీ ఇవ్వలేదని తెలియజేశారు. ఇదే విధంగా కంపెనీకి రుణ పత్రాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల క్రెడిట్‌ రేటింగ్‌లలోనూ ఎలాంటి మార్పులూ నమోదుకాలేదని వివరించారు. దీంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

Image result for Usha martin ltd

ఉషా మార్టిన్‌
విక్రయానికి ఉంచిన స్టీల్‌ బిజినెస్‌ కొనుగోలుకి టాటా గ్రూప్‌ మెటల్‌ దిగ్గజం టాటా స్టీల్‌ ఆసక్తి చూపినట్లు ఉషా మార్టిన్‌ తాజాగా వెల్లడించింది. దీంతో స్టీల్‌ బిజినెస్‌ విక్రయానికి టాటా స్టీల్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్‌ విలువను రూ. 4300-4700 కోట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. డీల్‌ ఆరు నెలల్లోగా పూర్తికాగలదని భావిస్తున్నట్లు ఉషా మార్టిన్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉషా మార్టిన్‌ షేరు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2 శాతం పెరిగి రూ. 32 వద్ద ట్రేడవుతోంది. తొలుత 16 శాతం జంప్‌చేసి రూ. 36 వరకూ ఎగసింది. కంపెనీలో ప్రమోటర్లకు 50.66 శాతం వాటా ఉంది.Most Popular