రియల్టీ, బ్యాంక్స్‌ డౌన్‌- మెటల్‌, ఐటీ అప్‌

రియల్టీ, బ్యాంక్స్‌ డౌన్‌- మెటల్‌, ఐటీ అప్‌

గత వారాంతాన తగిలిన అమ్మకాల షాక్‌ నుంచి మార్కెట్లు ఇంకా తేరుకోలేదు. దీంతో ప్రపంచ మార్కెట్లు బలపడినప్పటికీ దేశీయంగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయితే మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమై వెనువెంటనే నష్టాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 127 పాయింట్లు క్షీణించి 36,714కు చేరగా.. నిఫ్టీ 34 పాయింట్లు నీరసించి 11,109 వద్ద ట్రేడవుతోంది. నేటి నుంచి అమెరికా, చైనా మధ్య దిగుమతి సుంకాలు అమల్లోకిరానున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. శుక్రవారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు లాభాలతో ముగియడం గమనార్హం! 

ఆటో నేలచూపు
ఎన్‌ఎస్ఈలో మెటల్‌, ఐటీ రంగాలు 0.5 శాతం) చొప్పున బలపడగా.. మిగిలిన అన్ని రంగాలూ వెనకడుగులో ఉన్నాయి. రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో 2.2-1.3 శాతం మధ్య క్షీణించాయి. శుక్రవారం భారీగా పతనమైన దివాన్‌ హౌసింగ్‌ ప్రస్తుతం 16 శాతం జంప్‌చేయగా.. తొలుత యస్‌బ్యాంక్‌ 4 శాతం తిరోగమించింది. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫైనాన్స్‌, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌, ఐబీ హౌసింగ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎంఅండ్ఎం, యూపీఎల్‌, ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.5-1.6 శాతం మధ్య నష్టపోయాయి. అయితే ఓఎన్‌జీసీ, వేదాంతా, సిప్లా, హిందాల్కో, లుపిన్‌, కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా 2.2-0.6 శాతం మధ్య బలపడ్డాయి. 

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌లో ఇన్ఫీబీమ్, జీఎంఆర్‌, ఆయిల్‌ ఇండియా, మారికో, ఐజీఎల్‌, అదానీ పవర్‌ 7-1 శాతం మధ్య పుంజుకున్నాయి. మరోపక్క జేపీ, ఆర్కామ్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, రెప్కో హోమ్‌, ఆంధ్రా బ్యాంక్‌, క్యాప్లిన్‌ పాయింట్‌, చోళమండలం, మదర్‌సన్, ఐడియా 5-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. 

Related image

చిన్న షేర్లు పతనం
అమ్మకాలు పెరగడంతో మార్కెట్లను మించుతూ చిన్న షేర్లు పతనబాట పట్టాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.7 శాతం నీరసించగా.. స్మాల్‌ క్యాప్‌ 1 శాతం తిరోగమించింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1137 నష్టపోగా.. 506 లాభాలతో కదులుతున్నాయి.Most Popular