డో... ఎస్‌అండ్‌పీ-500 రికార్డ్స్‌!

డో... ఎస్‌అండ్‌పీ-500 రికార్డ్స్‌!

నేటి(24) నుంచీ ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్సును సవరిస్తున్న నేపథ్యంలో వరుసగా రెండో రోజు అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వెరసి శుక్రవారం డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ మరోసారి సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ట్రేడింగ్ ముగిసేసరికి డోజోన్స్‌ 78 పాయింట్లు(0.3 శాతం) పెరిగి 26,735 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 3 పాయింట్ల(0.1 శాతం) స్వల్ప లాభంతో 2,934 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. నాస్‌డాక్‌ మాత్రం 19 పాయింట్లు(0.23 శాతం) క్షీణించి 8,009 వద్ద  స్థిరపడింది. 

Image result for US Telcecom companies

టెలికంకు ప్రాధాన్యం
అమెరికా స్టాక్‌ ఇండెక్సులలో ఇండస్ట్రియల్స్‌, టెక్నాలజీ రంగాలకు ప్రాధాన్యమున్న ఎస్‌అండ్‌పీ-500 సూచీలో తాజాగా  టెలికం రంగానికి చోటు కల్పిస్తున్నారు. కమ్యూనికేషన్‌ సర్వీసుల పేరుతో ఏర్పాటు చేస్తున్న టెలికం రంగంలో అమెజాన్‌, ఫేస్‌బుక్‌, వాల్ట్‌డిస్నీలకూ స్థానం కల్పిస్తున్నారు. కాగా.. ఏటీఅండ్‌టీ ఇంక్‌ దాదాపు 2 శాతం పుంజుకోవడంతో టెలికం రంగం 1.4 శాతం బలపడింది. రీసెర్చ్‌ సంస్థ యూబీఎస్‌ ఏటీఅండ్‌టీ కౌంటర్‌కు బయ్‌ రేటింగ్‌ను ప్రకటించడం కూడా దీనికి కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ బాటలో సెక్యూరిటీ, అలార్మ్‌ కంపెనీ ఏడీటీ ఇంక్‌ 6 శాతం జంప్‌చేసింది. ఏడీటీతో భాగస్వామ్యంలో అలెక్సా గార్డ్‌ పేరుతో అమెజాన్‌ సరికొత్త సెక్యూరిటీ సేవలను ప్రవేశపెట్టడం ఈ కౌంటర్‌కు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

మెక్‌డొనాల్డ్స్‌ అప్‌ 
త్రైమాసిక డివిడెండ్‌ను 15 శాతం పెంచనున్నట్లు వెల్లడించడంతో మెక్‌డొనాల్డ్స్‌ కౌంటర్‌ 2 శాతం పుంజుకుంది. జేపీ మోర్గాన్‌ చేజ్‌ షేరు రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో అండర్‌ ఆర్మర్‌ ఇంక్‌ 3 శాతం ఎగసింది. అయితే మరోవైపు ఫాంగ్‌ స్టాక్స్‌గా పిలిచే ఫేస్‌బుక్‌, యాపిల్‌ ఇంక్‌, అమెజాన్‌.కామ్‌, నెట్‌ఫ్లిక్స్‌, అల్ఫాబెట్‌ బలహీనంగా ముగిశాయి. చైనాతో వాణిజ్య వివాదాల కారణంగా చిప్‌ దిగ్గజం మైక్రాన్‌ దాదాపు 4 శాతం పతనమైంది. రెండో త్రైమాసిక ఫలితాలపై అంచనాలు నిరాశరపచడంతో హోమ్‌ ఫర్నీషింగ్‌ రిటైలర్‌ పయర్‌1 ఇంపోర్ట్స్‌ 20 శాతంపైగా కుప్పకూలింది.  

 Most Popular