ప్రతికూల ఓపెనింగ్‌ చాన్స్‌!

ప్రతికూల ఓపెనింగ్‌ చాన్స్‌!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 27 పాయింట్లు క్షీణించి 11,145 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. గత వారాంతాన ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఉన్నట్టుండి పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా అమ్మకాలకు దిగడంతో షాక్‌తిన్నాయి. ప్రధానంగా ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 1100 పాయింట్లకుపైగా పడిపోయింది. తొలుత లాభాల డబుల్‌ సెంచరీ చేసిన సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం నుంచి 1300 పాయింట్లు కుప్పకూలింది. ఈ బాటలోనిఫ్టీ సైతం రోజులో గరిష్టం నుంచి 400 పాయింట్లకుపైగా పతనమైంది. ఫలితంగా సెన్సెక్స్‌ 36,000 పాయింట్ల మైలురాయిని కోల్పోగా.. నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. చివరికి ట్రేడర్ల స్క్వేరప్‌ లావాదేవీలతో కోలుకున్నప్పటికీ ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 280 పాయింట్ల వెనకడుగుతో 36,841 వద్ద నిలవగా.. నిఫ్టీ 91 పాయింట్లు తిరోగమించి 11,143 వద్ద స్థిరపడింది. కాగా.. శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు రికార్డు గరిష్టాల వద్ద నిలవడం విశేషం!

Image result for nse building images

నిఫ్టీ కదలికలు ఇలా..! 
నేడు నిఫ్టీ బలహీనపడితే తొలుత 10,891 పాయింట్ల వద్ద, తదుపరి 10,638 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,371 పాయింట్ల వద్ద, తదుపరి 11,599 స్థాయిలోనూ రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. బ్యాంక్‌ నిఫ్టీకి 24937, 24276 పాయింట్ల వద్ద మద్దతు.. 26374, 27151 వద్ద రెసిస్టెన్స్‌ కనిపించే వీలున్నట్లు పేర్కొన్నారు.

పెట్టుబడులవైపు...
నగదు విభాగంలో శుక్రవారం(21న) విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 761 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌ సైతం రూ. 497 కోట్ల విలువైన స్టాక్స్‌ నికరంగా కొనుగోలు చేశాయి. Most Popular