బాండ్ మార్కెట్ బాంబ్ పేలితే మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయి ?

బాండ్ మార్కెట్ బాంబ్ పేలితే మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయి ?

వారాంతంలో మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. శుక్రవారం మార్కెట్లలో చోటుచేసుకున్న అనూహ్య సెల్లాఫ్ మదుపుదారుల్లో గందరగోళం పెంచింది. అయితే అటు రిటైల్ మదుపుదారులతో పాటు ఫండ్ సంస్థలు సైతం ఈ పరిణామాలను నిశితంగా గమనించాయి. ముఖ్యంగా డెట్ ఫండ్ల రేటింగ్ లో సైతం అనూహ్య మార్పులు జరిగాయి. ఇందులో భాగంగా డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చిన డీఎస్‌పీ క్రెడిట్ రిస్క్ ఫండ్ రేటింగ్ ఒక్క సారిగా పతనమైంది. ఫండ్ లో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ గత వారం ఇంట్రెస్ట్ చెల్లింపులో డీఫాల్టర్ గా మిగలడంతో మొత్తం ఫండ్ రేటింగ్ AAA నుంచి D స్థాయికి పతనం అయ్యింది. దీంతో మొత్తం ఫండ్ పై ప్రభావం పడింది. ముఖ్యంగా బాండ్ మార్కెట్లలో వచ్చిన పెట్టుబడుల ఉపసంహరణ కూడా మార్కెట్లో సడెన్ సెల్లాఫ్‌కు దోహదం చేస్తుంది. 

అంతే కాదు డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్ AAA రేటింగ్ తో ఉన్న డీహెచ్ ఎఫ్ఎల్ స్టాక్ లో  9.1 శాతం వాటాలను వదిలించుకొని రిస్క్ నుంచి బయటపడింది. అయితే డెట్ ఫండ్స్ డిస్కౌంట్ ధరల్లో  డీహెచ్ఎఫ్ఎల్ విక్రయించడంతో కంపెనీ సెల్లాఫ్ కు దోహదపడింది. దీంతో అటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్లలో సెల్లింగ్ ప్రెజర్ కు దారితీసేందుకు ఈ పరిణామం దోహదపడింది. అలాగే ఎస్ బ్యాంక్ విషయంలోనూ ఈ తరహాలోనే మ్యూచువల్ ఫండ్స్ స్పందించాయి. 

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ లలో అమ్మకాలు ఎటు వైపు దారితీయనున్నాయి ? 

1. డీఎస్‌పీ బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ పై వచ్చిన ఒత్తిడి కారణంగా డీహెచ్ఎఫ్ఎల్ బాండ్స్ అమ్మకాలకు దారితీసింది. సుమారు 18 శాతం డిస్కౌంట్ తో బాండ్లను విక్రయించారు. అంటే వంద రూపాయలకు కొన్న బాండ్ ను కేవలం 82 రూపాయలకు విక్రయించారు. డీహెచ్ఎఫ్ఎల్ వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగింది. 

2. ఇక డీఎస్‌పీ ఎందుకు ఈ బాండ్స్ ను వదలించుకుంది అనే దానిపై వివరణలు చూస్తే.. IL&FS రేటింగ్ ఒక్కసారిగా AAA నుంచి D గ్రేడ్ రేటింగ్ డౌన్ గ్రేడ్ అవ్వడం వంటి పరిస్థితుల్లో డీహెచ్ఎఫ్ఎల్ బాండ్లను విక్రయించింది.  

3.  అలాగే ఇతర ఎఎంసీలు సైతం సుమారు రూ. 2800 కోట్ల మేర IL&FS బాండ్లను కలిగి ఉన్నాయి. అయితే సదరు కార్పోరేట్ క్లయింట్లను ఈ తరహా బాండ్లను వదిలించుకునేందుకు ఒత్తిళ్లు దోహదం చేస్తున్నాయి. డెట్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మొత్తం 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. అందులో డీ గ్రేడ్ ఫండ్స్ ఒత్తిడి సుమారు రూ.23,000- 24000 కోట్ల వరకూ ఉండే అవకాశం ఉంది.   

4. అయితే ఇలాంటి స్కీమ్స్ లో పోగొట్టుకున్న సొమ్ము వారంలో రావడం అంత సులభం కాదు. కానీ డీహెచ్ఎఫ్ఎల్ లేదా జీఎస్ఈసీ లాంటి షేర్లను వదిలించుకోవడం మినహా మరో మార్గం లేదు. జీఎస్ఈసీ ని ఆర్‌బీఐ ఓఎంఓ (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్) కు అనుమతించాల్సి ఉంది. 

5. ఒక వేళ ఆర్‌బీఐ ఓఎంఓ (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్)  అనుమతించినా,  ప్రభుత్వాలు ఎన్నికల వేళ అంతే స్థాయిలో ఖర్చు పెట్టి సుమారు 24000 కోట్ల రూపాయలను ప్రభుత్వ వ్యవస్థ నుంచి బయటకు అనుమతించలేవు.  

6. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు ఒకే సొల్యూషన్ ఉంది. ఎల్ఐసీ లాంటి సంస్థల మూలధనంతో ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ లేదా బ్యాంకులు, ఇతర మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేలా చూడాలి. తద్వారా ఆర్థికవ్యవస్థ కుప్పకూలకుండా కాపాడగలం. 

7. చివరిగా ఎల్ఐసీ లాంటి ప్రభుత్వ సంస్థల మూలధనాన్ని మార్కెట్లో ఒత్తిళ్లను స్థిరీకరించేందుకు వినియోగించడం ద్వారా పతనానికి అడ్డుకట్ట వేయవచ్చు. ఎన్నికల వేళ ప్రభుత్వం ఇంత కన్నా చేయగలిగిన పరిష్కారం మరొకటి లేదు. 
 Most Popular