సెన్సెక్స్‌ బౌన్స్‌బ్యాక్‌- యస్‌బ్యాంక్ పతనం

సెన్సెక్స్‌ బౌన్స్‌బ్యాక్‌- యస్‌బ్యాంక్ పతనం

వరుసగా మూడు రోజులపాటు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. 240 పాయింట్లు పెరిగి 37,361కు చేరింది. నిఫ్టీ సైతం 90 పాయింట్లు ఎగసి 11,324ను తాకింది. గురువారం మొహర్రం సందర్భంగా దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇండస్ట్రియల్స్‌, టెక్నాలజీ దిగ్గజాల అండతో డోజోన్స్ సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి వరుసగా రెండో రోజు జోరుగా ప్రారంభమైంది. దీంతో దేశీయంగానూ సెంటిమెంటు మెరుగుపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

Image result for Yes bank

ఐటీ మినహా
ఎన్‌ఎస్ఈలో ఐటీ మాత్రమే(0.5 శాతం) వెనకడుగు వేయగా.. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.25 శాతం స్థాయిలో ఎగశాయి. ఈ బాటలో ఎఫ్‌ఎంసీజీ, ఆటో సైతం 0.6 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌బ్యాంక్‌ 23 శాతం కుప్పకూలింది. ఎండీ, సీఈవో రాణా కపూర్‌ పదవీకాలాన్ని 2019 జనవరి వరకే రిజర్వ్‌ బ్యాంక్‌ అంగీకరించడం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర బ్లూచిప్స్‌లో ఐసీఐసీఐ, టాటా స్టీల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ, గెయిల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే టెక్‌ మహీంద్రా, జీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.2-0.5 శాతం మధ్య క్షీణించాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌లో స్టార్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, జిందాల్‌ స్టీల్‌, బెర్జర్‌ పెయింట్స్‌, ఎంఅండ్ఎం ఫైనాన్స్‌, సెయిల్‌, బయోకాన్‌ 4-2.5 శాతం మధ్య జంప్‌చేయగా.. జెట్‌ ఎయిర్‌వేస్‌, ఆర్‌కామ్, బలరామ్‌పూర్‌, కేపీఐటీ, మైండ్‌ట్రీ, డాబర్‌, ఎస్కార్ట్స్‌, ఇంద్రప్రస్థ 5-1 శాతం మధ్య పతనమయ్యాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ కళకళలాడుతున్నాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.35 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ 0.75 శాతం ఎగసింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 956 లాభపడగా.. 453 నష్టాలతో కదులుతున్నాయి.Most Popular