పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్ల పెంపు ....

పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్ల పెంపు ....

చిన్న మొత్తాల పొదుపు మీద వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ త్రైమాసికానికి ఓ సారి ఈ వడ్డీ రేట్లు మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ 2018 -2019 మూడో త్రైమాసికానికి గాను   చిన్న మొత్తాలు, PPF, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, సీనియర్ సిటిజన్ డిపాజిట్ల మీద 0.4 శాతం వడ్డీ రెట్లను ప్రభుత్వం పెంచింది. ఈ రేట్లు అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31 2018 వరకూ అమల్లో ఉంటాయి.


5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద 7.8శాతం, , రికరింగ్ డిపాజిట్ల మీద 7.3శాతం, సీనియర్ సిటిజన్  సేవింగ్స్ మీద   8.7 శాతం  వడ్డీని చెల్లిస్తారు. కాగా సీనియర్ సిటిజన్స్ ఖాతాలకు మాత్రమే ప్రతి మూడు నెలలకొకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. చిన్న మొత్తాల మీద వడ్డీ రేట్లు సాలీన 4 శాతం పెరుగదలను నిలుపుకున్నట్టైంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC) ల మీద ఇప్పుడున్న 7.6 శాతానికి పెంచి 8 శాతం వడ్డీని అందించనున్నారు. గతంలో ఉన్న వడ్డీ రెట్ల ప్రకారం కిసాన్ వికాస్ పత్రాలు 118 నెలల్లో మెచ్యూరిటిని పొందేవి. కానీ..ఇప్పుడు సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం అవి 112 నెలల్లోనే మెచ్యూర్ అవనున్నాయి. ఇది కస్టమర్లకు లాభదాయకంగా మారింది. గతంలో కిసాన్ వికాస్ పత్రాల మీద 7.7 శాతం మాత్రమే వడ్డీ వచ్చేది. ఇప్పడది 8 శాతానికి పెరిగింది. గతంలో 1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ 6.6 శాతం ఉండగా , ఇప్పుడు అది 6.9 శాతం గా పెరిగింది.
2 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లమీద గతంలో 6.7 శాతం ఉండగా ఇప్పుడు అది 7.0 శాతంగా పెరిగింది. మూడు
సంవత్సరాల డిపాజిట్లపై గతంలో 6.9 శాతం వడ్డీ రేటు ఉండగా , ఇప్పుడు 7.2 శాతానికి పెరిగింది.
ఇక 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ల మీద గతంలో 7.4 శాతం వడ్డీ రేటు ఉండగా, ఇప్పుడది 7.8 శాతంగా పెరిగింది. 5
సంవత్సరాల సీనియర్ సిటిజన్ డిపాజిట్లపై గతంలో 8.3 శాతం వడ్డీ ఉండగా ఇప్పుడు అది 8.7 శాతం పెరిగింది.Most Popular