మ్యూచువల్ ఫండ్స్‌కు సెబీ బాసట...

మ్యూచువల్ ఫండ్స్‌కు సెబీ బాసట...

మ్యూచువల్ ఫండ్స్ లో మీరు పెట్టుబడులు పెడుతున్నారా? అయితే మీకు ప్రస్తుతం మంచి రోజులు వచ్చినట్టే. తాజాగా సెక్యూరిటీస్ ఎండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI ) మంగళవారం మ్యూచువల్ ఫండ్స్ మీద టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో (TER) ను తగ్గించింది. దీని వల్ల మదుపర్లకు లాభాలతో బాటు ఎక్కువ రిటర్న్‌లు వస్తాయి. అయితే ఇక్కడ పెట్టుబడుదారులు అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఎంటి? సెబీ వీటి మీద పర్యవేక్షణ ఎలా చేస్తుంది, టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో (TER) అంటే ఎంటి? అన్న విషయాలను తెలుసుకుని ముందడుగు వేస్తేనే బాగుంటుంది.

Image result for SEBI REDUCE THE  total expense ratio
మ్యూచువల్ ఫండ్స్ అంటే...?
ఇండివిడ్యువల్స్ నుండి పెట్టుబడులను సేకరించి వాటిని పెద్ద పెద్ద కంపెనీ  స్టాక్స్ లో, సెక్యూరిటీస్ రూపంలో, బాండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసేవే మ్యూచువల్ ఫండ్స్. అయితే వీటిని  ప్రొఫెషనల్ ఫండ్ ఆర్గనైజర్‌లు మీ దగ్గర పెట్టుబడిని తీసుకుని  పెద్ద పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ MFలలో ఈక్విటీ షేర్స్, ఇండెక్స్ ఫండ్స్ , బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ అని రకరకాలు ఉంటాయి.
టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో (TER)... అంటే?
ఇక ఈ మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజర్స్ మీ దగ్గర నుండి డబ్బు తీసుకుని వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం, వాటికి సర్వీస్ ఫీజులు, ఎజెంట్ కమీషన్, రిజిస్టర్ ఫీజులు, షేర్ల అమ్మకాలు, వాటి ప్రమోషన్లు ఇలా వివిధ ఖర్చులన్నింటినీ కలిపి లెక్క వేసేదే TER . TER అనేది  మ్యూచువల్ ఫండ్ల  పెట్టుబడిదారుల సేవలకు చెల్లించే నిర్వహణ మొత్తం ఖర్చు యొక్క కొలమానంగా చెప్పుకోవచ్చు.

Related image
TER రేషియోను తగ్గించిన సెబీ..
ఈ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో తగ్గింపు చేయబడితే.. మ్యూచువల్ ఫండ్స్ కొన్న వారికి రిటర్న్స్ ఎక్కువైనట్టే.
ఇక తాజాగా సెబీ 1.75 శాతంగా ఉన్న ఈ TER రేషియోను 1.05 శాతానికి తగ్గించింది. దీని వల్ల అసెట్స్ మేనేజ్ మెంట్
కంపెనీలు (AMC) తమ AUM ల నిర్వాహణకు గాను ఎక్కువ శాతం TER ను వసూలు చేసుకోవచ్చు.  మీ పెట్టుబడులను ఒక సంవత్సరానికి గాను హోల్డ్ చేసినందుకు మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజర్ ఎడాదికి మీకు ఇంతని సర్వీస్ రుసుము వసూలు చేస్తాడు. ఒక్కోసారి ఈ నిర్వాహణ ఖర్చులు మీకు వచ్చే లాభాల నుంచి  డిడక్ట్   చేసుకుంటారు. సెబీ ఈ TER రేషియోను తగ్గించడం వల్ల నేరుగా మ్యూచువల్ ఫండ్స్ కొన్న వారికి అదనపు భారం అంటూ పడకపోగా.. లాభాలు నేరుగా వచ్చేలా ఉంటాయి. ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) మీద కూడా సెబీ  1 శాతానికి తగ్గించింది. ఈక్విటీ ఓరియెంటెడ్ స్కీమ్స్ లలో TER 1.25 శాతానికి మించకూడదని సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఈక్విటీ ఓరియెంట్ కాని వాటికి 1శాతానికి TER మించకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీర్ఘకాలిక ఇన్వెస్ట్ మెంట్స్ లో ఈ TER శాతం తగ్గింపు మదుపరులకు లాభం చేకురుస్తుంది. ఉదాహరణకు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ లో  15 శాతం TER ఉన్నట్టైతే సాలీనా మన పెట్టుబడి మీద సర్వీస్ ఖర్చులే అధికంగా కనబడతాయి. అదే ఇప్పుడు సెబీ నిర్ణయించిన ప్రకారం 1.05 శాతానికి మించకూడదు కనుక దాదాపు పెట్టుబడి మీద 14 శాతం మనకు లాభాల రూపంలో తిరిగి రానుంది.  

 

 Most Popular