స్టాక్స్ టు వాచ్ (19-09-2018)

స్టాక్స్ టు వాచ్ (19-09-2018)

ఇండియా హ్యుమ్ పైప్ : మధ్య ప్రదేశ్ జల్ నిగం నుంచి రూ. 221 కోట్ల విలువైన ప్రొక్యూర్ మెంట్, కన్‌స్ట్రక్షన్, టెస్టింగ్, కమిషనింగ్, ట్రయల్ రన్ పనులు పొందినట్లు తెలిపంది.  దీంతో ఈ స్టాక్ మదుపరులను ఆకర్షించవచ్చు. 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ : సరస్వత్ కో ఆపరేటివ్ బ్యాంక్ తో కలిసి నూతన లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్టులను ప్రవేశపెట్టేందుకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సన్నాహాలు చేస్తోంది. 

సన్ ఫార్మా : కంపెనీకి చెందిన స్పానిష్ విభాగం అల్మిరాల్‌కు యూరోపియన్ కమిషన్ నుంచి ఇలుమెట్రి ఔషధానికి అప్రూవల్ లభించింది. దీంతో ఈ స్టాక్ నేటి ట్రేడింగ్‌లో ఫోకస్‌లో ఉండొచ్చు.

సోమ్ డిస్టల్లరీస్ : కంపెనీ త్వరలో కర్ణాటకలో బ్లాక్‌ఫోర్ట్ బీర్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్ల కదలికను గమనించవచ్చు.Most Popular