మీ ATM కార్డును మార్చుకున్నారా?

మీ ATM కార్డును మార్చుకున్నారా?

దేశంలోని అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డులు ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకే పనిచేస్తాయి. ఈలోపే మీరు మీ బ్యాంక్ ఏటీఎం కార్డులను మార్చుకోండి. ఇప్పటిదాకా ఎటీఎం డెబిట్, క్రెడిట్ కార్డులు మెగా స్ట్రిప్ తో తయారు చేయబడినవే ఉన్నాయి. కానీ ఇక మీదట EMV ( యూరో పే, మాస్టర్ కార్డ్, వీసా ) చిప్ బేస్డ్ కార్డులే వాడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. 2018 డిసెంబర్ 31 వ తేదీ తరువాత పాత డెబిట్ , క్రెడిట్ కార్డులు పని చేయబోవని RBI హెచ్చరించింది. ఇప్పటికే RBI ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లను కార్డులు మార్చుకోవాలని పిలుపు నిచ్చింది. కాగా ఈ కొత్త EMV  కార్డుల మీద ఎడమవైపు యాక్సెస్ చిప్ ఉంటుంది. ఈ క్రెడిట్ , డెబిట్ కార్డులను బ్యాంకులో మార్చుకోవచ్చనీ, ఇందుకు గాను ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రతి కార్డును బ్యాంకు వెబ్ సైట్‌లోకి అప్ లోడ్ చేసి ఇస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయిMost Popular