పెరగనున్న ఓలా క్యాబ్స్ పెట్టుబడులు

పెరగనున్న ఓలా క్యాబ్స్ పెట్టుబడులు

క్యాబ్ సేవల వ్యాపారంలో దూసుకెళ్తున్న ఓలా క్యాబ్స్ తన మార్కెట్ పరిథి పెంచుకోడానికి నిధులు సమకూర్చుకునే పనిలో పడింది. లాభాలు పెంచుకోడం కోసం క్యాబ్ సేవలతో బాటు ఇతర వ్యాపారాలలోకి ప్రవేశించనున్నట్టు కంపెనీ మాతృసంస్థ ANI టెక్నాలజీస్  తెలిపింది.
చైనా కంపెనీల ఆపన్న హస్తం...
కంపెనీ విస్తరణకు దాదాపు 50 మిలియన్ డాలర్ల (సుమారు 350 కోట్ల రూపాయిలు ) నిధులను రెండు చైనా కంపెనీల నుండి సేకరించనుంది. చైనా ఇన్వెస్టర్లు సెయిలింగ్ కాపిటల్, యూరేసియాన్ ఎకనామిక్ కార్ప్ ల నుండి బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్ ద్వారా ఈ నిధులు సమకూర్చుకోనున్నట్టు తెలుస్తుంది.  కాగా సెయిలింగ్ కాపిటల్స్, చైనా యూరేషియన్ ఎకనామిక్ కార్ప్‌లు ఓలా లో 1.17 శాతం పెట్టుబడి పెట్టాయి.  మరో వైపు ప్రముఖ పెట్టుబడి సంస్థ అయిన స్టెడ్ వ్యూ కాపిటల్ కూడా ఓలా క్యాబ్స్‌తో చర్చలు జరిపిందని, ప్రస్తుతం ఉన్న వాటాను ఉపసంహరించుకోడంపై కూడా స్టెడ్ వ్యూ కాపిటల్ అధినేత రవి మోహతా యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. స్టెడ్ వ్యూ క్యాపిటల్, సీక్వెల్ క్యాపిటల్ తో కలిసి తొలుత 2014లో ఓలా కంపెనీలో 250 కోట్ల పెట్టుబడిని పెట్టింది.

Image result for temasek
టిమాసెక్ అండతో....
మరో ప్రముఖ ఇన్వెస్టింగ్ సంస్థ టిమాసెక్ కూడా ఓలా కు అండగా నిలవడంతో కంపెనీలో ఓలా ఫౌండర్స్ అగర్వాల్, అంకిత్ భాటిల ప్రాధాన్యం పెరిగిపోయింది. టిమాసెక్, ఓలా మాతృసంస్థ అయిన ANI లో 5శాతం వాటాను కొనుగోలు చేసింది. టిమాసెక్ దన్నుతో రెండోసారి పెట్టుబడులకోసం ఓలా అధినేతలు యత్నిస్తున్నారు. బోర్డులో వీరిద్దరి ప్రాధాన్యత పెరగడం వెనుక టిమాసెక్ అండ ఉందన్నది వాస్తవం. ఓలా లో అతి పెద్ద వాటా దారైన సాఫ్ట్ బ్యాంక్ ని కూడా వీరు ఇప్పుడు వీటో చేయగల స్థాయికి చేరుకున్నారు. కాగా విదేశీ ఇన్వెస్టర్లు ఓలా వైపు ఆసక్తి చూపడంతో ఫ్లిప్ కార్ట్  సహ వ్యవస్థాపకుడు సచిన్  బన్సాల్ , స్టెడ్ వ్యూ క్యాపిటల్ అధినేత రవి మెహతా తమ పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. Most Popular