టారిఫ్‌ వార్- యూరప్‌, ఆసియా ప్లస్‌లో! 

టారిఫ్‌ వార్- యూరప్‌, ఆసియా ప్లస్‌లో! 

చిట్టచివరికి 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనీస్‌ దిగుమతులపై అమెరికా ప్రభుత్వం 10 శాతం టారిఫ్‌లను ప్రకటించింది. ఈ ఏడాది చివరికల్లా సుంకాలను 25 శాతానికి పెంచనున్నట్లు అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా పేర్కొన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి వాణిజ్య వివాద భయాలు తలెత్తినప్పటికీ ఆసియా, యూరోపియన్‌ మార్కెట్లలో అధిక శాతం లాభాలతో కదులతున్నాయి.  యూరోపియన్‌ మార్కెట్లలో ప్రస్తుతం జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌, ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.5 శాతం చొప్పున ఎగశాయి. అయితే యూకే ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 0.2 శాతం వెనకడుగుతో ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో చైనా, థాయ్‌లాండ్, జపాన్‌ 1.5 శాతం స్థాయిలో జంప్‌చేయగా.. హాంకాంగ్‌ 0.6 శాతం, కొరియా 0.25 శాతం చొప్పున బలపడ్డాయి. కాగా.. మరోవైపు తైవాన్‌, సింగపూర్‌, ఇండొనేసియా 0.65-0.25 శాతం మధ్య నీరసించాయి.

యూఎస్‌ నష్టాల్లో
చైనా దిగుమతులపై టారిఫ్‌ల ప్రకటన అంచనాలతో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. మార్కెట్లు ముగిశాక ప్రెసిడెంట్‌ ట్రంప్‌ 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై 10 శాతం టారిఫ్‌లను ప్రకటించడంతో వెంటనే స్టాక్‌ ఫ్యూచర్స్‌ దెబ్బతిన్నాయి. ఒకవేళ చైనా ఇందుకు చర్యలు తీసుకుంటే మరో 67 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపైనా సుంకాలను విధించగలమని ట్రంప్‌ పేర్కొనడం గమనార్హం. కాగా.. ఇప్పటికే అమెరికన్‌ విధానాలపై ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)కు ఫిర్యాదు చేసిన చైనా ప్రభుత్వం వాణిజ్యం విషయంలో తాము రక్షణాత్మక విధానాలకు కట్టుబడబోమంటూ స్పష్టం చేసింది. డంపింగ్‌ డ్యూటీల విషయంలో నిబంధనలు పాటించనందున ఏడాదికి 700 కోట్ల డాలర్ల విలువైన అమెరికా వాణిజ్యంపై ఆంక్షలు విధించాలంటూ డబ్ల్యూటీవోను చైనా డిమాండ్‌ చేసింది. 

Image result for zalando uk

జలాండో పతనం, క్లారియంట్‌ జూమ్‌
2018 అమ్మకాల అంచనాలకు సంబంధించి రెండు నెలల్లో రెండోసారి కోత పెట్టడంతో జర్మన్‌ రిటైలింగ్‌ సంస్థ జలాండో కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ షేరు 17 శాతం కుప్పకూలింది. సౌదీ అరేబియా సంస్థ శాబిక్‌తో హై పెర్‌ఫార్మెన్స్‌ మెటీరియల్స్‌ తయారీకి భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో స్విస్‌ కెమికల్స్‌ దిగ్గజం క్లారియంట్‌ 7 శాతం జంప్‌చేసింది. మూడో క్వార్టర్‌ ఫలితాల అంచనాలతో బ్రిటిష్‌ ఆన్‌లైన్‌ రిటైలర్‌ ఒకాడో దాదాపు 2 శాతం బలపడింది. కాగా మరోవైపు టెక్నాలజీ షేర్లు ఏఎంఎస్‌, ఎస్‌టీ మైక్రోఎలక్ట్రానిక్స్‌ 1 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి.Most Popular