రిలీఫ్‌ ర్యాలీతో షురూ- షుగర్‌ షేర్లు డౌన్‌!

రిలీఫ్‌ ర్యాలీతో షురూ- షుగర్‌ షేర్లు డౌన్‌!

అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద ఆందోళనలతో సోమవారం పతనమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 63 పాయింట్లు బలపడి 37,649కు చేరగా.. నిఫ్టీ 17 పాయింట్లు పుంజుకుని 11,395 వద్ద ట్రేడవుతోంది. 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనీస్‌ దిగుమతులపై 10 శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్ ప్రకటించడంతో సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టపోగా.. ఆసియాలోనూ అధిక శాతం మార్కెట్లు బలహీనపడ్డాయి. కాగా.. రెండు రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన షుగర్‌ స్టాక్స్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. లు స్టాక్స్‌ 10-5 శాతం మధ్య పతనమయ్యాయి.
 Image result for banks
పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.5 శాతం పతనంకాగా.. ఐటీ 0.5 శాతం క్షీణించింది. అయితే ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు 0.6 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌యూఎల్‌, యూపీఎల్‌, యస్‌బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మా, ఎంఅండ్ఎం 2.2-0.75 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, విప్రో, వేదాంతా, ఎయిర్‌టెల్‌, ఐషర్‌, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ 2.2-0.5 శాతం మధ్య నీరసించాయి.
ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌లో బయోకాన్‌, గ్రాన్యూల్స్‌, ఆర్‌కామ్‌, టీవీఎస్‌ మోటార్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 3.5-1.4 శాతం మధ్య ఎగశాయి. మరోపక్క బీవోబీ, బలరామ్‌పూర్‌, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, పీవీఆర్‌, హెచ్‌సీసీ, రెప్కో హోమ్‌, కేన్‌ఫిన్‌, ఇంజినీర్స్‌ ఇండియా 9-2 శాతం మధ్య పతనమయ్యాయి. 
చిన్న షేర్లు ఓకే
మార్కెట్ల బాటలో చిన్న షేర్లలోనూ కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.15 శాతం పుంజుకున్నాయి. ఇప్పటివరూక ట్రేడైన షేర్లలో 972 లాభపడగా.. 664 డీలాపడ్డాయి.  Most Popular