వాచీలకు, సైకిల్‌ హెల్మెట్లకూ రిలీఫ్‌!

వాచీలకు, సైకిల్‌ హెల్మెట్లకూ రిలీఫ్‌!

అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనీస్‌ దిగుమతులపై సుంకాలను విధించనున్నట్లు ప్రకటించడంతో ఆసియా స్టాక్‌ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. అయితే వారాంతాన సెలవులో ఉన్న జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 1.5 శాతం జంప్‌చేయగా.. చైనా ఇండెక్స్‌ షాంఘై దాదాపు యథాతథంగా ట్రేడవుతోంది. కాగా.. చైనాపై టారిఫ్‌ల విధింపు అంచనాలతో సోమవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిశాక ట్రంప్‌ చైనా దిగుమతులపై 10 శాతం టారిఫ్‌లను విధించనున్నట్లు వెల్లడించడంతో ప్రస్తుతం అమెరికా స్టాక్‌ ఫ్యూచర్స్‌ అమ్మకాలతో నీరసించాయి. చైనాతో అమెరికా వాణిజ్య లోటు భారీగా పెరిగిందని.. దీనిని ఇకపై ఉపేక్షించబోమని ట్రంప్‌ వ్యాఖ్యానించడంతో నేడు కూడా అమెరికా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా సుంకాల విధిస్తే తాము రక్షణాత్మక విధానాలకు కట్టుబడబోమంటూ చైనా ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నట్లు ఆర్ధికవేత్తలు చెబుతున్నారు.

Image result for Apple inc smart watches

కొన్ని ప్రొడక్టులకు మినహాయింపు
అమెరికన్‌ టెక్‌ దిగ్గజం యాపిల్‌ తయారీ స్మార్ట్‌ వాచీలు, సైకిళ్ల హెల్మెట్లు తదితర కొన్ని ప్రొడక్టులను టారిఫ్‌లనుంచి మినహాయిస్తున్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తెలియజేశారు. అయితే చైనా సైతం టారిఫ్‌లను విధించేందుకు సిద్ధపడితే మరో 67 బిలియన్‌ డాలర్ల వస్తు దిగుమతులపై సైతం సుంకాలను విధించగలమని ట్రంప్‌ హెచ్చరించారు. 

జపాన్‌ లాభాల్లో..
ప్రస్తుతం ఆసియాలో జపాన్‌ 1.5 శాతం జంప్‌చేయగా.. థాయ్‌లాండ్‌ 0.4 శాతం పుంజుకుంది. కొరియా స్వల్పంగా 0.1 శాతం బలపడగా.. మిగిలిన మార్కెట్లన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌, ఇండొనేసియా, సింగపూర్‌, తైవాన్‌ 0.75-0.45 శాతం మధ్య క్షీణించగా చైనా స్వల్పంగా అంటే 0.1 శాతం వెనకడుగులో ఉంది. సోమవారం యూరోపియన్‌ మార్కెట్లు నామమాత్ర నష్టాలతో ముగిశాయి. కాగా.. 10ఏళ్ల కాలపరిమితి గల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ తాజాగా 3 శాతాన్ని అధిగమించాయి. మరోవైపు డాలరుతో మారకంలో యూరో 1.162కు చేరగా.. జపనీస్‌ యెన్‌ 111.74 వద్ద ట్రేడవుతోంది. 
 Most Popular