Breaking - మెగా మర్జర్ : దేనా, విజయా, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం

Breaking - మెగా మర్జర్ :  దేనా, విజయా, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం
  • పీఎస్‌యూ బ్యాంకుల విలీనంలో మరో అడుగు
  • విలీనం కాబోతున్న దేనాబ్యాంక్, విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా
  • ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై కేంద్రం దృష్టి సారించిన నేపథ్యంలో తాజాగా మరో మూడు బ్యాంకుల ఈ దిశగా కసరత్తు ప్రారంభించాయి. మధ్య స్థాయి పీఎస్‌యూ బ్యాంకులైన విజయా, దేనా బ్యాంకులను బ్యాంక్‌ ఆఫ్ బరోడాలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బ్యాంకు విలీన ప్రక్రియ గురించి బ్యాంకింగ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. దీనిపై ఇప్పటికే విలీనమైతే చేకూరే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లు మొదలైన అంశాలపై  బ్యాంకుల బోర్డులు పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మూడు బ్యాంకులు విలీనం చెందితే దేశంలోనే మూడవ అతి పెద్ద బ్యాంకు ఏర్పటు కానుంది. 

విజయా బ్యాంకుకు దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు ఉండగా, దేనా బ్యాంక్‌కు మహారాష్ట్ర, దాని పొరుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా పీఎస్‌యూ బ్యాంకుల్లో దిగ్గజ బ్యాంకుగా పేరొందింది. ఈ మూడు కలిస్తే మధ్య స్థాయి పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా నిలవొచ్చని భావిస్తున్నారు. పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో బ్యాంకింగ్‌ సేవలు మరింతగా విస్తరించే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎస్‌బీఐతో పాటు దాని అనుబంధ బ్యాంకుల విలీనం ద్వారా శ్రీకారం చుట్టిన ఈ ప్రక్రియలో రెండో దశలో భాగంగా బీవోబీ, దేనా, విజయా బ్యాంకు విలీనం చర్చలు గత ఏడాది కాలంలో కొనసాగుతున్నాయి. 

 
 



Most Popular