తట్టుకుని నిలిచిన ఆ నాలుగు FMCG కంపెనీలు ....

తట్టుకుని నిలిచిన ఆ నాలుగు FMCG కంపెనీలు ....

దేశంలో ప్రముఖ FMCG కంపెనీలైన ఇమామీ, టాటా గ్లోబల్ , జ్యోతీ ల్యాబరేటరీస్, బజాజ్ కార్ప్ కంపెనీలు పంపిణీ, ఉత్పత్తి సామర్ధ్యాలను , కంపెనీ పోర్ట్ ఫోలియోలను పునరుద్దరించుకోడం  ద్వారా వారి కంపెనీల సేల్ గ్రాఫ్‌ ను పెంచుకోనున్నారు.  గత నెలలో దిద్దుబాటు చర్యలున్నప్పటికీ FMCG కంపెనీలు తమ వృద్ధిలో క్షీణతను నమోదు చేశాయి కానీ,ఇమామి, టాటా గ్లోబల్ బేవరేజెస్, జ్యోతి, బజాజ్ కార్ప్‌లు లాభాల బాటలో నడిచాయి.
ఇక ఈ ఆర్ధిక సంవత్సరం ఆరంభం నుండి ఈ నాటి వరకూ ఇమామీ , టాటా గ్లోబల్, జ్యోతీ లాబ్స్, బజాజ్ కార్ప్,
కంపెనీలు సానుకూల వృద్ధిని కనబరిచాయి. మార్కెట్‌లో మొదటి మూడు స్థానాల్లో ఉన్న FMCG  కంపెనీల షేర్లు 10 నుండి 30శాతం వరకూ నష్టపోయినా... జ్యోతీ లాబ్స్ మాత్రం నికరంగా 5 శాతం లాభాలను చూపించింది. బోంబే స్టాక్ ఎక్సేంజ్ లో FMCG ఇండెక్స్ ప్రకారం 12 శాతం వృద్ధిని చూపింది. సెన్సెక్స్ లో పది శాతం వృద్ధిని చూపిన కంపెనీ జ్యోతీ లాబరేటరీస్ మాత్రమే.  
FMCG కంపెనీలకు గడ్డుకాలమే...
గత రెండు సంవత్సరాల నుండి FMCG కంపెనీలకు గడ్డుకాలమే నడుస్తుందని చెప్పాలి. ఈ రెండేళ్ళల్లో సగటు వృద్ధి రేటు 6 శాతమే ఉంది. FMCG కంపెనీల్లో అత్యంత కనిష్టంగా 0.8 నుండి 1.4 శాతమే వృద్ధి నమోదు కావడం గమనార్హం.  పెద్ద నోట్ల రద్దు, GST  పన్ను విధానం , ఈ రెండు FMCG కంపెనీల అమ్మకాలను ప్రభావితం చేశాయి. ఆదాయం, పంపిణీ రంగాలను కుదేలు చేశాయి.  సరికొత్త ఆవిష్కరణలు లేక పోవడం, GST కారణంగా ధరల తగ్గుదల వల్ల వస్తు ఉత్పత్తుల రంగంలో వృద్ధి అనేది పూర్ షోగా మారింది.
కానీ ఇవి మాత్రం భేష్ ....!
అయినప్పటికీ ఈ నాలుగు కంపెనీలు మాత్రం తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు నడుం కట్టాయి. కీలక ఉత్పత్తుల పంపిణీ విధానాలను మార్చుకోడంతో ఇమామీ గట్టెక్కింది. పరిపాలన, అమ్మకాలను పునఃనిర్మించుకోడంతో టాటా గ్లోబల్,  హోల్ సేల్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా జ్యోతీ లాబ్స్, ప్రాజెక్ట్ పోర్ట్ ఫోలియోలను నవీనీకరించుకోడం ద్వారా బజాజ్ కార్ప్ లు మార్కెట్ లో ముందంజ వేశాయి. 2018 తొలి త్రైమాసికంలో ఈ నాలుగు కంపెనీలు బలమైన వృద్ధి రేటును నమోదు చేశాయి. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, వాటి ప్రచారం , ప్రమోటింగ్ వంటివి వారి ఆర్ధిక వృద్ధికి ప్రధాన కారణాలై ఉంటాయిని విశ్లేషకులు భావిస్తున్నారు.

Image result for fmcg companies emami
నిలబడ్డ ఇమామీ ఉత్పత్తులు...
మార్కెట్ మంద గమనంలో ఉన్నప్పటికీ ఇమామీ, 2016-2018 ఆర్ధిక సంవత్సరాల్లో తన ఉత్పత్తుల అమ్మకాల మీద కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR ) 0.8 శాతంగా  నమోదు చేసింది. తన సహచర కంపెనీలు తిరోగమనంలో ఉన్నప్పటికీ 2018 ఆర్ధిక సంవత్సరానికి గానూ(FY 18)  5 శాతం పురోగతిని సాధించింది. ఒక్క కేశ్ కింగ్ అమ్మకాల్లోనే నిరుత్సాహం కనిపించిందనీ,  రానున్న త్రైమాసికాల్లో కేశ్ కింగ్ అమ్మకాలను 10 శాతం పెంచేవిధంగా చర్యలు తీసుకుంటామని... ఇమామీ CEO ఫైనాన్స్ NH.భన్సాలీ తెలిపారు.  రానున్న రోజుల్లో ఇమామీ ముఖ్య ఉత్పత్తులైన కేశ్ కింగ్, ఫేయిర్ &హ్యాండ్‌సమ్ , బోరో ప్లస్‌ల అమ్మకాలు జోరందుకుంటాయని మార్కెట్ విశ్లేషకుల అంచనా.  

Image result for tata global beverages
 టాటా గ్లోబల్ బేవరేజ్ ... ఏవరేజ్...!
ఇక TGBL తన ప్రధాన ఆదాయవనరైన అంతర్జాతీయ వ్యాపారం వల్ల ఎకీకృత ఆదాయం తగ్గింది. గత రెండు సంవత్సరాలలో కంపెనీ వృద్ధి రేటు 1.3 శాతానికే పరిమితమైంది. ఓవరాల్ గ్రోత్ పెంచుకోడానికి కంపెనీ తక్షణ చర్యలకు ఉపక్రమించింది.  ఆదాయం అంతగా రాని పలు శాఖలను మూసివేయడం, అంతర్జాతీయ వ్యాపార విధానాలను పునర్నిర్మించుకోడం, అదనపు కార్యకలపాలను సరళీకరించుకోడం వంటి వాటిపై దృష్టి పెట్టింది. ఏకీకృత నష్టాలను తగ్గించుకోడం, ఆదాయ నిష్పత్తిని పెంచుకోడం వంటి చర్యలు కంపెనీకి హెల్ప్ అవుతాయని విశ్లేషకులు అంటున్నారు

Image result for jyothy laboratories
జ్యోతీ లాబ్స్‌పై కేరళ వరద ప్రభావం..!

పెద్ద నోట్ల రద్దు, GST  అమలు వంటి చర్యలు  జ్యోతీ లాబ్స్ హోల్ సేల్ వ్యాపారాలమీద దెబ్బ కొట్టాయి.
గత రెండేళ్ళలో ప్రధానంగా అకౌంటింగ్ పద్ధతులలో మార్పు మూలంగా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో అమ్మకాలపై 1శాతం మాత్రమే నమోదైంది. ఈ రెండేళ్ళలో కంపెనీ వాల్యూమ్ గ్రోత్ 6 శాతంగా నమోదైంది.
అయినప్పటికీ కంపెనీ ముఖ్య ఉత్పత్తులైన ఉజాలా వంటి బ్రాండ్ల అమ్మకాలు పెరిగాయని జ్యోతీ ల్యాబ్స్ జాయింట్ MD కామత్ పేర్కొన్నారు. హోల్ సేల్ అవుట్ లెట్స్ ను పెంచుకోనున్నామనీ, ఇప్పుడున్న 80 వేల స్టాక్ పాయింట్లను లక్ష హోల్ సేల్ అవుట్ లెట్స్ గా పెంచనున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి. రానున్న ఆర్ధిక సంవత్సరం 2019 కల్లా కంపెనీ వృద్ధి రేటు 12-15 శాతానికి పెంచనున్నామని జ్యోతీ ల్యాబ్స్ పేర్కొంది. సంస్థ తన మార్జిన్లను కాపాడుకోడానికి 7శాతం ధరల పెంపు నిర్ణయం కూడా తీసుకుంది. అలాగే కేరళ వరద ప్రభావం కూడా కంపెనీ ఉత్పత్తుల అమ్మకాల మీద స్వల్పంగా ఉందని కామత్ తెలిపారు. జ్యోతీ ల్యాబ్స్ అమ్మకాల్లో కేరళ వాటా 15 శాతం ఉంటుంది. అయినప్పటికీ 2018 సెప్టెంబర్ త్రైమాసికంలో 6 నుండి 7 శాతం  పెరుగుదలను చూపింది.

Image result for bajaj corp ltd
బజాజ్ కార్ప్ తొలి త్రైమాసికం ఓకే....  
కాగా బజాజ్ కార్ప్ మాత్రం తొలి త్రైమాసికంలో సంతృప్తికర ఫలితాలను నమోదు చేసింది. గత రెండేళ్లుగా ఉత్పత్తుల అమ్మకాలు 1.4 శాతమే పెరగడం కాస్త నిరుత్సాహపరిచినప్పటికీ తన ప్రధాన ఉత్పత్తులైన ఆల్మండ్ డ్రాప్స్ హెయిర్ ఆయిల్, నోమార్క్స్ ల అమ్మకాలు 11.2 శాతం  పెరిగాయి. బజాజ్ కార్ప్ చేపట్టిన డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ కూడా నోమార్క్స్ ప్రోడక్ట్‌  మార్కెట్ వాటాను సంవత్సరం ప్రాతిపదికన 50 బేసిస్ పాయింట్లు పెరగడానికి సహాయపడింది.రానున్న ఆర్ధిక సంవత్సరం 2019 కల్లా హెయిర్ ఆయిల్ ఉత్పత్తులు, నోమార్క్స్ బ్రాండ్ ల అమ్మకాలు మరింత పెరగే అవకాశాలున్నాయని బజాజ్ కార్ప్ ఎండీ సుమిత్ మల్హోత్రా అంటున్నారు.

 Most Popular