GST దామాషా ప్రకారం తగ్గించ బడిన రేట్లను, దానికి గాను ఉత్పత్తుల మీద కస్టమర్లకు రావాల్సిన లాభాలను పంచనందుకు ప్రముఖ దిగ్గజ కంపెనీ హిందుస్థాన్ యూనీలివర్ పై ఉచ్చు బిగుస్తుంది. ది నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ ఆధారిటీ(NAA ) హిందూస్థాన్ లీవర్‌పై వచ్చేనెలలో తీర్పునివ్వబోతుంది. హిందుస్థాన్ లీవర్ కంపెనీకి ఈ సెప్టెంబర్ 24 వరకు వివరణ ఇచ్చేందుకు గడువిచ్చిన NAA , తీర్పును రిజర్వ్ చేస్తామని తెలిపింది.
కస్టమర్లకు ధరలను తగ్గించని HUL ....
కేంద్రం సవరించిన GST ద్వారా ఉత్పత్తులపై సుంకం రేట్లు తగ్గించినపుడు, ఆ వస్తువు ధర కూడా దిగి వస్తుంది. దిగి వచ్చిన ధరే కస్టమర్లకు లాభంగా చెప్పబడుతుంది. ఇది అన్ని FMGC కంపెనీలకు వర్తిస్తుంది. GST ప్రకారం తగ్గించబడ్డ వస్తువు ధరను ఎప్పటికప్పుడు కస్టమర్లకు తెలియజేయాలి. కానీ..ఇక్కడే హిందుస్థాన్ లివర్ లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. దాదాపు రు. 400 కోట్ల రూపాయిల మేరకు ధర తగ్గింపులను వినియోగదారులకు ఇవ్వకుండా లాభాల్లో జమ చేసుకుందని ఆరోపణలు వచ్చాయి
పాత రేట్లతోనే బాదుడు.... .?
GST నిర్దేశించిన FMGC వస్తువులైన రేజర్లు, డియోడరెంట్లు, వాషింగ్ పౌడర్లు, వాషింగ్ సోపులు, లిక్విడ్స్, సబ్బులు, కాస్మెటిక్స్, షేవింగ్ క్రీమ్స్ వంటి 178 వస్తువులపై సుంకాల్ని తగ్గించింది కేంద్రం. నవంబర్ 15, 2017 నాటి నుండి ఇది అమల్లో ఉంది. కానీ.. అప్పటి నుండి ఇప్పటి దాకా హిందుస్థాన్ యూనీ లివర్ తన ప్రోడక్ట్స్ పై ధరలను తగ్గించలేదు.ఇది చట్ట వ్యతిరేకమని... విచారణ జరిపిన డైరెక్టర్ జనరల్- సేఫ్ గార్డ్స్ (DG AP ) పేర్కొంది. దాదాపు ఈ వస్తువులపై కస్టమర్లకు 400 కోట్ల రూపాయిల లాభాన్ని పంచాల్సి ఉండగా హిందూస్థాన్ లీవర్ మాత్రం మిన్నకుండి పోయిందని ప్రభుత్వ ఆరోపణ.
కొత్త వాటికే రేట్లు తగ్గించలేదంటున్న HUL
అయితే హిందుస్థాన్ కంపెనీ మాత్రం స్టాక్ కీపింగ్ యూనిట్స్ కింద 820 రకాల వస్తువులను చూపించామని, అందులోనివి కాకుండా కొత్త ప్రొడక్ట్స్‌కు మాత్రమే ధరలను తగ్గించలేదని వాదించింది. ఇక ఈ కేసులో హిందుస్థాన్ కంపెనీ వివరణ కోరినప్పటికీ , తప్పు చేసినట్టు తేలితే.. జరిమానా తో బాటు GST, కంపెనీ లైసెన్స్ కూడా రద్దు చేసే దుస్థితి రావొచ్చు .