సెన్సెక్స్‌ @38,000- 11,500 దాటిన నిఫ్టీ!

సెన్సెక్స్‌ @38,000- 11,500 దాటిన నిఫ్టీ!

తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు బుల్‌ దౌడు తీశాయి. వరుసగా రెండో రోజు లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు సమయం గడిచేకొద్దీ జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే డబుల్‌ సెంచరీ చేయడం ద్వారా ఊపందుకున్న సెన్సెక్స్‌ చివరికి ట్రిపుల్‌తో ముగించింది. తద్వారా 38,000 పాయింట్ల మైలురాయిని సైతం అధిగమించింది. ఈ బాటలో నిఫ్టీ సైతం సెంచరీ సాధించింది 11,500 ఎగువన నిలిచింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 373 పాయింట్లు జంప్‌చేసి 38,091కు చేరగా... నిఫ్టీ 145 పాయింట్లు ఎగసి 11,515 వద్ద స్థిరపడింది. 

మూడు షేర్లు మాత్రమే 
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. రియల్టీ దాదాపు 4 శాతం పుంజుకోగా.. మెటల్‌, ఫార్మా, బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో 2.5-1.5 శాతం మధ్య పెరిగాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌పీసీఎల్‌, వేదాంతా, యూపీఎల్‌, ఐవోసీ, గ్రాసిమ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్‌ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో హెచ్‌సీఎల్‌ టెక్‌, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌ మాత్రమే 1.5-1 శాతం మధ్య క్షీణించాయి.
 
చిన్న షేర్లు జోరు
మార్కెట్ల బాటలో చిన్న, మధ్యతరహా షేర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.5 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1817 లాభపడగా.. 842 మాత్రమే నష్టపోయాయి. 

ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు 
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1086 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా... దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 541 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. సోమవారం దాదాపు రూ. 842 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన ఎఫ్‌పీఐలు మంగళవారం మరింత అధికంగా రూ. 1454 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా...  సోమవారం రూ. 290 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన దేశీ ఫండ్స్‌ మంగళవారం దాదాపు రూ. 750 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.Most Popular