షేర్ల ధరలూ, ట్రేడింగ్‌ జూమ్‌

షేర్ల ధరలూ, ట్రేడింగ్‌ జూమ్‌

పటిష్ట లాభాలతో దౌడు తీస్తున్న మార్కెట్లలో కొన్ని కౌంటర్లలో భారీ స్థాయిలో లావాదేవీలు నమోదవుతున్నాయి. దీనికితోడు షేర్ల ధరలు సైతం హైజంప్‌ చేస్తున్నాయి. వీటిలో శ్రీరేణుకా షుగర్స్‌, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, కోల్టే పాటిల్‌ డెవలపర్స్‌ ఉన్నాయి. వివరాలు చూద్దాం.. 

శ్రీ రేణుకా షుగర్స్‌: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన శ్రీ రేణుకా షుగర్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం దాదాపు 13 శాతం జంప్‌ చేసింది. రూ. 14.6 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 15.25 వద్ద ఇంట్రాడే గరిష్టాన్నీ, రూ. 13 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. గత 20 రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణంతో పోలిస్తే ఇప్పటివరకూ 38 రెట్లు అధికంగా లావాదేవీలు నమోదుకావడం విశేషం! 

జిందాల్‌ స్టెయిన్‌లెస్‌: ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ హిసార్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దాదాపు 8 శాతం  దూసుకెళ్లింది. రూ. 151 సమీపంలో ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 157 వద్ద గరిష్టాన్నీ, రూ. 140 వద్ద కనిష్టాన్నీ తాకింది. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఈ కౌంటర్లో ఇప్పటివరకూ 12 రెట్లు అధిక ట్రేడింగ్‌ పరిమాణం నమోదైంది.

కోల్టేపాటిల్‌ డెవలపర్స్‌: పుణే కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన రియల్టీ సంస్థ కోల్టే పాటిల్‌ డెవలపర్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 6 శాతం దూసుకెళ్లింది. రూ. 285 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 320 వద్ద గరిష్టానికి చేరగా.. రూ. 269 వద్ద కనిష్టాన్నీ తాకింది. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఈ కౌంటర్లో ఇప్పటివరకూ 10 రెట్లు అధిక ట్రేడింగ్‌ పరిమాణం నమోదుకావడం గమనార్హం!Most Popular