సెన్సెక్స్‌ ట్రిపుల్‌ -రియల్టీ, మెటల్‌ స్పీడ్

సెన్సెక్స్‌ ట్రిపుల్‌ -రియల్టీ, మెటల్‌ స్పీడ్

వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే డబుల్‌ సెంచరీ చేయడం ద్వారా ఊపందుకున్న సెన్సెక్స్‌ ప్రస్తుతం ట్రిపుల్‌ను సాధించింది. 324 పాయింట్లు జంప్‌చేసి 38,042కు చేరింది. తద్వారా 38,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించగా.. నిఫ్టీ సైతం 118 పాయింట్లు ఎగసి 11,488 వద్ద ట్రేడవుతోంది. 

ఐటీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ మాత్రమే(0.55 శాతం) బలహీనపడగా.. మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. రియల్టీ దాదాపు 3 శాతం పుంజుకోగా.. మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో 2.3-1.5 శాతం మధ్య పెరిగాయి. రియల్టీ కౌంటర్లలో ఒబెరాయ్‌, ప్రెస్టేజ్‌, ఇండియాబుల్స్‌, యూనిటెక్‌, బ్రిగేడ్‌, డీఎల్‌ఎఫ్‌, శోభా, హెచ్‌డీఐఎల్‌ 5-1.7 శాతం మధ్య జంప్‌చేశాయి. మెటల్‌ స్టాక్స్‌లో జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, వేదాంతా, జిందాల్‌ స్టీల్‌, హింద్‌ జింక్‌, సెయిల్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, హింద్‌ కాపర్‌ 8-2 శాతం మధ్య పురోగమించాయి. కాగా.. డెరివేటివ్‌ స్టాక్స్‌లో కమిన్స్‌, జైన్‌ ఇరిగేషన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టొరంట్‌ ఫార్మా, కేపీఐటీ, మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్‌, జస్ట్‌ డయల్‌, కోల్‌ ఇండియా, జూబిలెంట్‌ ఫుడ్‌  3-1 శాతం మధ్య డీలాపడ్డాయి.  
 
చిన్న షేర్లు జోరు
మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.3 శాతం బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1776 లాభపడగా.. 771 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. Most Popular