ఫెర్టిలైజర్ షేర్లకు కొత్త పాలసీ జోష్‌

ఫెర్టిలైజర్ షేర్లకు కొత్త పాలసీ జోష్‌

కేంద్ర ప్రభుత్వం సరికొత్త పంటల కొనుగోలు విధానాన్ని(ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ) అనుమతించడంతో ఎరువులు, రసాయన కంపెనీల షేర్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో పలు ఫెర్టిలైజర్‌ కంపెనీల షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌(ఆర్‌సీఎఫ్‌) షేరు అత్యధికంగా 9.5 శాతం దూసుకెళ్లి రూ. 74ను తాకగా... ఫెర్టిలైజర్స్‌ కెమికల్స్‌(ఫ్యాక్ట్‌) 10 శాతం జంప్‌చేసి రూ. 47కు చేరింది. ఈ బాటలో నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌) 5 శాతం ఎగసి రూ. 47 వద్ద, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌ 2.5 శాతం పుంజుకుని రూ. 163 వద్ద ట్రేడవుతోంది. ఇక నాగార్జునా(ఎన్‌ఎఫ్‌సీఎల్‌) 3 శాతం పెరిగి రూ. 12.7 వద్ద, జీఎస్ఎఫ్‌సీ 2 శాతం బలపడి రూ. 113 వద్ద, గుజరాత్‌ నర్మదా వ్యాలీ(జీఎన్‌ఎఫ్‌సీ) 2 శాతం లాభంతో రూ. 403 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదే విధంగా జువారీ ఆగ్రో 2 శాతం పెరిగి రూ. 300కు చేరగా, కోరమాండల్‌ 2 శాతం బలపడి రూ. 404ను తాకింది. దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ 1.5 శాతం పుంజుకుని రూ. 239 వద్ద, స్పిక్‌ 1 శాతం లాభంతో రూ. 30 వద్ద ట్రేడవుతున్నాయి.

పాలసీ ఇలా 
కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కొత్త ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీలో భాగంగా ఆయిల్‌ సీడ్స్‌ రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కంటే దిగువకు ధరలు పతనమైతే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇది ఒక పథకంకాగా.. మరో పథకం ప్రకారం ప్రొక్యూర్‌మెంట్‌ చేపట్టేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయవేట్‌ సంస్థలను అనుమతించవచ్చు. వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన కొత్త ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ 'అన్నదాత మౌల్య సంరక్షణ యోజన'ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు వార్తలు వెలువడ్డాయి. Most Popular