కార్పోరేట్లకు వరాలు

కార్పోరేట్లకు వరాలు

కార్పోరేట్ రంగంలోని పబ్లిక్ మరియు ప్రైవేటు  కంపెనీలకు కేంద్ర కార్పోరేట్ మంత్రిత్వ శాఖ ఊరట నిచ్చే జీవోను పాస్ చేసింది. సంస్థ బైలాస్  ప్రకారం వారి  అధికారులకు కొన్ని పరిమితుల కంటే జీతాలు ఎక్కువగా  చెల్లించడం కోసం, లేదా కంపెనీ నిర్వాహక సిబ్బందికి జీతాలు పెంచాల్సి వచ్చినపుడు  ఇంతకుముందు ప్రభుత్వ ఆమోదం పొందాల్సి వచ్చేది,  కానీ..ఇప్పుడావసరం లేదని, ఇలాంటి సందర్భాల్లో వాటాదారుల ఆమోదం ఉంటే సరిపోతుందని..కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం నాడు తెలిపింది.

Image result for company laws 2013
జీతాల పెంపుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు...
ఇప్పటి వరకు, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, కార్పోరేట్ సంస్థల అధికారులు  వారి ఉద్యోగులకు కొన్నిస్థాయిలు మించి వేతనం చెల్లించాల్సినప్పుడు మంత్రిత్వ శాఖ నుండి అనుమతిని తీసుకోవాల్సి వచ్చేది. నిర్వాహణా సిబ్బందికి వేతన చెల్లింపు కంపెని నికర లాభంలో 11శాతం కంటే ఎక్కువగా ఉన్నా,  కేంద్ర ప్రభుత్వ అనుమతి ఇకపై అవసరం లేదు "అని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కార్పోరేట్ సంస్థల పనితీరు సులభతరం కావాలని ,అందుకే ఈ విధానాన్ని సవరించామని.. కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Related image
వాటాదార్లు ఓకే అంటేనే...
అయితే వాటాదారుల అంగీకారం పొందిన తరువాతనే  ఒక కంపెనీ ఇటువంటి చెల్లింపులు చేయవచ్చు, బోర్డు సభ్యుల ఓటింగ్‌లో కనీసం 75 శాతం మంది సభ్యుల ఆమోదం అవసరమని మినిస్ట్రీ తెలిపింది. 2013 కంపెనీల చట్టం క్రింద ప్రభుత్వ మరియు ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. సాధారణంగా పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో 200 కు పైబడే సభ్యులు ఉంటారు. మన దేశంలో దాదాపు 70 వేల పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు నమోదయి ఉన్నాయని..మంత్రిత్వ శాఖ తెలిపింది.
అడ్డంకులు తొలిగాయి...
సంస్థల ఉన్నత స్థాయి ఉద్యోగులకు , నిర్వాహకులకు ఇప్పటి వరకూ ఈ చట్టం ప్రకారం పేలవమైన ప్యాకేజీలే ఇవ్వబడ్డాయన్న అసంతృప్తి కార్పోరేట్ వర్గాల్లో ఉంది. ఈ చట్టం క్రింద నిర్వాహణా అధికారులకు సంస్థ నికర లాభం విలువ ఆధారంగా చెల్లించాల్సి వచ్చేది..అదీ ప్రభుత్వ అనుమతి ఉంటేనే.  సాధారణంగా కంపెనీ ఎక్జిగ్యూటివ్ డైరెక్టర్లకు 1-3శాతం వరకూ వేతన పెంపుకు అనుమతి ఉంటుంది. ఇక కంపెనీ నిర్వాహక యజమాన్యం లేదా కంపెనీ ఎండీకి ఇచ్చే వేతనం ఆ కంపెనీ నికర విలువ, రాబడి ఆధారంగా ఉంటుంది. ఇప్పుడీ చట్టం ద్వారా.. కంపెనీ ఎండీల వేతన పెంపుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
తక్షణం అమల్లోకి...
 ఇప్పటికే కేంద్రానికి    వేతనం చెల్లింపు కోసం పెట్టుకున్న  ప్రతిపాదనలు , పెండింగ్ దరఖాస్తులు ఈ  సడలింపు కిందకు వస్తాయని కార్పోరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ నెల సెప్టెంబర్ 12 నుండే నిబంధనల సవరింపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని.. ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా  కంపెనీ డైరెక్టర్ల అర్హతలు, వేతనాలకు సంబంధించిన షెడ్యూల్ V  కి సంబంధించిన మార్పులు కూడా తెలియజేయబడ్డాయి. కంపెనీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా షెడ్యూల్ వీ కింద పొందే వేతనాలను కంపెనీ డైరెక్టర్లు పొందుతారని..మినిస్ట్రీ తెలిపింది.Most Popular