కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, వేదాంతా జూమ్‌

కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, వేదాంతా జూమ్‌

ప్రాజెక్ట్‌ ఫైనాన్సింగ్‌కు బ్యాంకు నుంచి అనుమతి పొందిన వార్తలతో మౌలిక సదుపాయాల సంస్థ కేఎర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కౌంటర్‌ జోరందుకోగా.. కృష్ణా గోదావరి(కేజీ) బేసిన్‌లో గ్యాస్‌ నిక్షేపాలు కనుగొన్నట్లు వార్తలు వెలువడటంతో అనిల్‌ అగర్వాల్‌ గ్రూప్‌ దిగ్గం వేదాంతా కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు ఇలా...

ఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌
పూర్తి అనుబంధ సంస్థ కేఎన్‌ఆర్‌ శంకరం ప్రాజెక్ట్స్ చేపట్టనున్న హెచ్‌ఈఎమ్‌ ప్రాజెక్ట్‌కు బ్యాంకు నుంచి ఆర్థిక మద్దతు లభించినట్లు వెల్లడించడంతో కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 208 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 214 వరకూ జంప్‌చేసింది. సొంత అనుబంధ సంస్థకు చెందిన రూ. 1234 కోట్ల విలువైన హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌(హెచ్‌ఏఎం) ప్రాజెక్ట్‌కు ఫైనాన్షియల్‌ క్లోజర్‌ను పూర్తిచేసినట్లు కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ తాజాగా పేర్కొంది. తెలంగాణలోని జాతీయ రహదారిలో రామసాన్‌పల్లే నుంచి మంగ్లూర్‌ వరకూ నాలుగు లైన్ల రహదారిని అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్ట్‌ లభించినట్లు కేఎన్‌ఆర్ తెలియజేసింది. 

వేదాంతా లిమిటెడ్‌
కృష్ణా గోదావరి(కేజీ) బేసిన్‌లో నిర్వహిస్తున్న అన్వేషణలో భాగంగా A3-2 బావిలో సహజవాయు(నేచురల్‌ గ్యాస్‌) నిక్షేపాలు నిక్షేపాలు(హైడ్రోకార్బన్‌ డిస్కవరీ) ఉన్నట్లు పెట్రోలియం, సహజవాయువు శాఖతోపాటు.. హైడ్రోకార్బన్స్‌ డీజీకి తెలియజేసినట్లు వేదాంతా లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టిసారించారు. ప్రస్తుతం ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.25 శాతం జంప్‌చేసి రూ. 231 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 232.5 వరకూ పెరిగింది. Most Popular