సారిడాన్, పారాసిటమాల్‌కు ఇక చెల్లు...

సారిడాన్, పారాసిటమాల్‌కు ఇక చెల్లు...

మన దేశంలో ఇప్పటికీ ఎన్నో హానికారక మందులను మనం వాడుతూనే ఉన్నాం. విదేశాల్లో నిషేధించిన డ్రగ్స్ ను భారత్‌లో మాత్రం యద్ధేచ్ఛగా అమ్ముతుంటారు. దేశంలో మెడిసిన్ మీద సరైన నియంత్రణ లేదనడానికి ఇదో ఉదాహరణ. కానీ.. మనుషులకు హానికారక ట్యాబ్లెట్లమీద ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.

Image result for FDC tablets saridonసారిడాన్‌కు తలనొప్పి మొదలు...
నొప్పి నివారణ మాత్ర సారిడాన్‌ సహా దాదాపు 300 రకాల ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ ఔషధాలను  భారత ప్రభుత్వం నిషేధించింది. ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ ద్వారా రూపొందే దగ్గు మందులు, జలుబు బిళ్లలు, నొప్పి నివారణ మాత్రలు ఇకపై ఎక్కడా తయారీ, పంపిణీ, అమ్మకాలు జరిపేందుకు వీల్లేదని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ విధానం తక్షణం అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పింది. ఎఫ్‌డీసీ మందుల వాడకం వల్ల అందులోని ఔషధ పదార్థాలు రోగికి ఏ విధమైన మేలూ చేయడం లేదని, వీటి విచ్చలవిడి వాడకం నుంచి ప్రజలను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎఫ్‌డీసీ విధానంలో తయారైన ఈ మందుల్లో వైద్యపరమైన ప్రమాణాలేవీ పాటించడంలేదని దేశ ఔషధ సలహా విభాగమైన డ్రగ్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డు వెల్లడించింది.
పని చేయని మందులే...
ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ డ్రగ్‌ అంటే.. రెండు కన్నా ఎక్కువ ఔషధ పదార్థాలు ఒకే డోస్‌లో లభించడం. ఉదాహరణకు నిషేధిత జాబితాలో ఉన్న పారాసిటమాల్‌’ మాత్ర ఒకే ఔషధంతో తయారు కాదు. ఇది రెండు రకాల ఔషధాల కలిపి తయారు చేస్తారు . ఇలాంటి వాటిని సేవించడం వల్ల ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా ఉంటోందని డ్రగ్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డు స్పష్టం చేసింది.

Image result for FDC tablets saridon
రోగాన్ని తగ్గించని భారతీయ మందులు ...
దాదాపు 328 రకాల ఎఫ్‌డీసీలు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేవేనని డ్రగ్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డు ఆరోగ్యశాఖకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. భారత్‌లో మొత్తం 2 వేల రకాల ఎఫ్‌డీసీలు ఉండగా.. అమెరికాలో 500 రకాలు మాత్రమే ఉండటం ఇక్కడ గమనార్హం. మన దేశంలో ఈ FDCలను కొనసాగించాలని.. దేశీయ ఫార్మా కంపెనీల నుండి ఒత్తిళ్ళు వచ్చినా.. ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. ఒకానొక దశలో దిగ్గజ ఓషధ సంస్థలు ఢిల్లీ హైకోర్టునూ ఆశ్రయించాయి.
దొడ్డిదారిన అనుమతులు, లైసెన్స్‌లు ...
సాధారణంగా ఓషధ తయారీ సంస్థలు కేంద్రం నుండి లైసెన్స్ పొందుతాయి. కానీ..ఈ FDCలను తయారు చేసే వారు రాష్ట్రాల నుండి లైసెన్స్‌లు పొందుతుంటారు. మెడిసిన్ సరైనది అయితే.. నేరుగా భారత ఓషధ నియంత్రణ సంస్థ నుండి అనుమతులు పొందాల్సి ఉంటుంది.  విక్స్‌ యాక్షన్‌ 500, డీకోల్డ్‌, కోరెక్స్‌ కాఫ్‌ సిరప్‌ సహా మొత్తం 344 రకాల ఎఫ్‌డీసీల అమ్మకాలపై గతంలోనే ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపై 2016లో దిగ్గజ ఔషధ సంస్థలైన పిఫిజర్‌, గ్లెన్‌మార్క్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. తర్వాత కోర్టు ప్రభుత్వ నిషేధంపై స్టే విధించింది. ఇప్పుడు కేంద్రం ఇలాంటి మందులను అమ్మడానికి విల్లేదని తెగేసి చెప్పడంతో ఇప్పుడు పలు సంస్థలు చట్టంలోని వెసులుబాటులను వెతికే పనిలో పడ్డాయి.

 

 Most Popular