రియల్టీ,  ఫార్మా, మెటల్‌ దూకుడు...!

రియల్టీ,  ఫార్మా, మెటల్‌ దూకుడు...!

రూపాయి బాటలో జోరందుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఊపందుకున్నాయి. తొలుత లాభాల డబుల్‌ సెంచరీ సాధించిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 171 పాయింట్లు జంప్‌చేసి 37,889కు చేరింది. తద్వారా 38,000 పాయింట్ల మైలురాయికి చేరువకాగా.. నిఫ్టీ సైతం 70 పాయింట్లు ఎగసి 11,440 వద్ద ట్రేడవుతోంది. 

డెరేవేటివ్స్‌ ఇలా
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ మాత్రమే(0.25 శాతం) బలహీనపడగా.. మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. రియల్టీ, ఫార్మా, మెటల్‌, బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో 2.3-1 శాతం మధ్య ఎగశాయి. రియల్టీ కౌంటర్లలో ఒబెరాయ్‌, ప్రెస్టేజ్‌, ఇండియాబుల్స్‌, ఫీనిక్స్‌, బ్రిగేడ్‌, డీఎల్‌ఎఫ్‌, శోభా, హెచ్‌డీఐఎల్‌ 4-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. డెరివేటివ్‌ స్టాక్స్‌లో బలరామ్‌పూర్, ఎంఅండ్ఎం ఫైనాన్స్‌, జిందాల్‌ స్టీల్‌, జేపీ, దాల్మియా భారత్‌, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌, గ్రన్యూల్స్‌, యూపీఎల్‌, ఐబీ హౌసింగ్‌, బీపీసీఎల్‌ 8-4 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోవైపు కమిన్స్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, జైన్‌ ఇరిగేషన్‌, జస్ట్‌ డయల్‌, కేపీఐటీ, జూబిలెంట్‌ ఫుడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టొరంట్‌ ఫార్మా, మైండ్‌ట్రీ 3-1 శాతం మధ్య డీలాపడ్డాయి.  
 
చిన్న షేర్లు జోరు
మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతంపైగా పురోగమించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1662 లాభపడగా.. 674 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. 



Most Popular