వామ్మో... పెట్రోల్ ధరలు...

వామ్మో... పెట్రోల్ ధరలు...

దేశంలో పెట్రో మంటలు ఇంకా చల్లారక పోగా రాను రాను మరింత పెరిగిపోతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం పెట్రోల్ , డీజిల్ రేట్లు మరింత పెరిగాయి. ముంబైలో లీటర్‌కు  పెట్రోల్ 28 పైసలు పెరిగి 88.67గా అయింది. డీజిల్ ధర లీటర్‌కు 24 పైసలు పెరిగి 77.82గా మారింది.  దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ , డీజిల్ ధరలు 23 నుండి 28 పైసలు వరకూ పెరిగాయి. ఇక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 81.28గా, డీజిల్ ధర లీటర్‌కు 73.30గా ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ 85 రూపాయిలుగానూ, డీజిల్ ధర 77.49 రూపాయిలుగాను ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, రూపాయి పతనం పెట్రోల్ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. చమురు దిగుమతుల మీద ఆంక్షలు కూడా  రేట్ల పెరుగుదలకు మరో కారణమని.. మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇవి మునుముందు మరింత పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్‌తో రూపీ మారకపు విలువ 71.78గా ఉండటం.., రూపీ బలపడకపోవడంతో రానున్న రోజుల్లో మరిన్ని పెట్రో కష్టాలు తప్పకపోవచ్చు.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');