పాల ఉత్పత్తుల్లో పతంజలి

పాల ఉత్పత్తుల్లో పతంజలి

ఆయుర్వేద ఉత్పత్తులు, నిత్యావసర సరకుల వ్యాపారంలో అగ్రగామి సంస్థగా ఎదుగుతున్న  రాందేవ్ బాబాకు   చెందిన పతంజలి ప్రోడక్ట్స్  త్వరలోనే పాలు, పాల ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగు పెడుతోంది. రాబోయేసంవత్సరంలో  1000 కోట్ల వ్యాపారమే లక్ష్యంగా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నామని బాబా రాందేవ్ చెప్పారు. ఈ ఏడాది రూ. 500 కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా.. పతంజలి ఆయుర్వేద పాల ఉత్పత్తులలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో డైరీ ఉత్పత్తుల కంపెనీల షేర్లు ప్రభాత్‌ డైరీ, క్వాలిటీ, హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌, పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌ తదితరాలు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.
రోజుకి 10 లక్షల లీటర్ల పాలు...
ప్రతి రోజు 10 లక్షల లీటర్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, దేశంలోని పాడి రైతులను ప్రోత్సహించడానికే ఈ రంగంలోకి వస్తున్నామని రాందేవ్ బాబా తెలిపారు.  ఇతర సంస్థల కంటే రూ. 2 తక్కువకే తమ పతంజలీ పాలు దొరుకుతాయని కంపెనీ పేర్కొంది. . మరోవైపు కూరగాయలు, స్వీట్ కార్న్, బీన్స్ తదితర ఉత్పత్తులను కూడా విక్రయించే యోచనలో ఉన్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Image result for patanjali milk
20 వేల మందికి ఉపాథి కల్పన ...
ఇప్పటికే దేశీ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చి ప్రముఖ రిటైల్‌ స్లోర్లకు గట్టి పోటీ ఇస్తున్న బాబా రామ్‌దేవ్‌ తన పతంజలి నుంచి మరో ఐదు ఉత్పత్తులను మార్కెట్‌లోకి తేనున్నట్లు తెలిపారు . సమర్థ భారత్‌.. స్వస్థ భారత్‌ మిషన్‌లో భాగంగా పాలు, పాల ఉత్పత్తులు, నిల్వ చేయడానికి వీలున్న కూరగాయాలు, సోలార్‌ ఉత్పత్తులు, డ్రింకింగ్‌ వాటర్‌, పశువుల మేతకు సంబంధించిన ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు బాబా రాందేవ్‌ తన ట్విటర్‌లో ప్రకటించారు. ఈ విభాగంలోదాదాపు 20 వేల మందికి ఉపాధిని కల్పించనున్నట్టు పతంజలి సంస్థ తెలిపింది.Most Popular