సన్‌ ఫార్మా ద్వయం వెలుగులు!

సన్‌ ఫార్మా ద్వయం వెలుగులు!

జెల్‌ప్రోస్‌ ఔషధానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి లభించినట్లు వెల్లడికావడంతో సన్‌ ఫార్మా గ్రూప్‌ షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సన్‌ ఫార్మా అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ కంపెనీ(స్పార్క్‌) షేరు 4.4 శాతం జంప్‌చేసింది. రూ. 401 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 414 వరకూ ఎగసింది. ఇక సన్ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ షేరు సైతం ప్రస్తుతం 1.4 శాతం పెరిగి రూ. 659 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 671 వద్ద ఇంట్రాడే గరిష్టాన్నీ.. రూ. 658 వద్ద కనిష్టాన్నీ తాకింది.
ఇతర వివరాలు
ఓపెన్‌ యాంగిల్‌ గ్లుకోమా లేదా ఆక్యులర్‌ హైపర్‌టెన్షన్‌ చికిత్సకు వినియోగించగల జెల్‌ప్రోస్‌(Xelpros) ఔషధానికి తాజాగా యూఎస్‌ఎఫ్‌డీఏ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు సన్‌ ఫార్మాస్యూటికల్‌ పేర్కొంది. లేటనోప్రాస్ట్‌ ఆప్తాల్మిక్‌ ఎమల్షన్‌గా పేర్కొనే ఈ ఔషధాన్ని గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంటులో తయారు చేయనున్నట్లు తెలియజేసింది. కాగా.. 2015 జూన్‌లో జెల్‌ప్రాస్ట్‌మ్‌ ఔషధ లైసెన్సింగ్‌కు సన్‌ ఫార్మాకు స్పార్క్‌ కేటాయించింది. దీంతో యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి కారణంగా స్పార్క్‌కు సన్‌ ఫార్మా నుంచి మైల్‌స్టోన్‌ చెల్లింపులు లభించే అవకాశముంది. అంతేకాకుండా యూఎస్‌లో ఈ ఔషధాన్ని వాణిజ్య ప్రాతిపదికన విక్రయించడం ద్వారా మైల్‌స్టోన్‌ చెల్లింపులతోపాటు.. స్పార్క్‌కు రాయల్టీలు సైతం సన్‌ ఫార్మా చెల్లించాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');