సెన్సెక్స్‌ డబుల్‌- ఐటీ మినహా..!

సెన్సెక్స్‌ డబుల్‌- ఐటీ మినహా..!

దేశీ కరెన్సీ రూపాయి బాటలో స్టాక్‌ మార్కెట్లు సైతం వరుసగా రెండో రోజు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే రూపాయి 45 పైసలు కోలుకోగా.. సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. ప్రస్తుతం 210 పాయింట్లు జంప్‌చేసి 37928కు చేరింది. తద్వారా 38,000 పాయింట్ల మైలురాయికి చేరువలో నిలిచింది. నిఫ్టీ 74 పాయింట్లు ఎగసి 11,444 వద్ద ట్రేడవుతోంది. గురువారం వినాయక చవితి పండుగ సందర్భంగా దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. యాపిల్‌సహా ఇండస్ట్రియల్‌ దిగ్గజాలు బలపడటంతో అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 
అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ మాత్రమే(1 శాతం) బలహీనపడగా.. మిగిలిన అన్ని రంగాలూ పుంజుకున్నాయి. రియల్టీ, మెటల్‌, ఫార్మా, బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో 1.5-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌, బీపీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌పీసీఎల్‌, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, యస్ బ్యాంక్‌, ఐషర్, ఐవోసీ, గ్రాసిమ్‌ 3.4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే సాఫ్ట్‌వేర్‌ బ్లూచిప్స్‌ టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌సహా ఎంఅండ్‌ఎం 1.5-0.7 శాతం మధ్య తిరోగమించాయి.  
చిన్న షేర్లు జోరు
మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతంపైగా పురోగమించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1198 లాభపడగా.. 266 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. Most Popular