ఫోర్టీస్ ఫోర్జరీ కేసు వాపసు

ఫోర్టీస్ ఫోర్జరీ కేసు వాపసు

ఫోర్టీస్ హెల్త్ కేర్ అధినేతలైన మల్వీందర్ సోదరుల మధ్య వివాదానికి ఇక తెరపడనుంది.ఫోర్టీస్ హెల్త్ కేర్ కో ఫౌండర్ అయిన శివేందర్ సింగ్ తన అన్న మల్వీందర్ సింగ్ మీద వేసిన కేసును ఉపసంహరించుకోనున్నారు. తన భార్య సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు అక్రమంగా వాడుకున్నారని, శివేందర్ సింగ్ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. ఈ వివాదం కంపెనీ షేర్లమీద గణనీయంగా ప్రభావం చూపింది. చివరకు మల్విందర్ సోదరుల తల్లి నిమ్మీ సింగ్ మధ్యవర్తిత్వంతో ఈ వివాదం సమసి పోయిందని.., శుక్రవారం  ఈకేసును ట్రిబ్యునల్ ముందు ఉపసంహరించుకోనున్నారని.. ఫోర్టీస్ వర్గాలు తెలిపాయి.Most Popular