చక్కెర షేర్లకు ఇథనాల్‌ తీపి!

చక్కెర షేర్లకు ఇథనాల్‌ తీపి!

ఇథనాల్‌ ధరలను 25 శాతం వరకూ పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడంతో షుగర్‌ షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో శ్రీ రేణుకా, ఎంపీ షుగర్స్‌, గాయత్రి షుగర్స్‌, త్రివేణీ ఇంజినీరింగ్‌, ప్రాజ్‌ ఇండస్ట్రీస్‌ 3-5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇథనాల్‌ ధరలను 25 శాతంమేర పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పరిశ్రమకు మేలు చేయనున్నట్లు షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌(ఇస్మా) పేర్కొంది. దీంతో పలు కంపెనీలు షుగర్‌ బిజినెస్‌ను ఇథనాల్‌ తయారీకి మళ్లించే వీలుంటుందని అభిప్రాయపడింది. రానున్న కాలంలో పెట్రోల్‌లో ఇథనాల్‌ను 10 శాతంవరకూ మిక్స్‌చేసే వీలున్నట్లు తెలియజేసింది. షుగర్‌ బిజినెస్‌ నుంచి ఇథనాల్‌కు మళ్లితే కంపెనీలకు వాటిల్లే నష్టాలకు పరిహారం లభించాల్సి ఉంటుందని ఇస్మా వ్యాఖ్యానించింది.  
షేర్ల జోరు  
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో శ్రీ రేణుకా షుగర్స్‌ దాదాపు 12 శాతం దూసుకెళ్లి రూ. 12.85కు చేరగా..  ధంపూర్‌ షుగర్స్‌ 9.5 శాతం జంప్‌చేసి రూ. 98 సమీపానికి చేరింది. ఈ బాటలో ఉత్తమ్‌ షుగర్స్‌, ద్వారికేష్‌, గాయత్రి షుగర్స్‌ 5 శాతం చొప్పున జంప్‌చేయగా.. బజాజ్‌ హిందుస్తాన్‌, దాల్మియా, ఆంధ్రా షుగర్‌, అవధ్‌ షుగర్స్‌, త్రివేణీ ఇంజినీరింగ్‌, ప్రాజ్‌ ఇండస్ట్రీస్‌, బలరామ్‌పూర్‌, బన్నారీ అమ్మన్‌ 4-2 శాతం మధ్య ఎగశాయి. Most Popular