రుపీ... బౌన్స్‌బ్యాక్‌!

రుపీ... బౌన్స్‌బ్యాక్‌!

ట్రేడింగ్‌ ప్రారంభంలోనే డాలరుతో మారకంలో సరికొత్త కనిష్టాన్ని తాకిన దేశీ కరెన్సీ బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. చరిత్రాత్మక కనిష్టం 72.91 నుంచి సుమారు 80 పైసలు ఎగసింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో మంగళవారం ముగింపుతో పోలిస్తే 47 పైసలు(0.64 శాతం)బలపడింది. ప్రస్తుతం 72.22 వద్ద ట్రేడవుతోంది. స్టాక్ మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసింది. దీంతో రూపాయి సైతం బలాన్ని పుంజుకుంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి మంగళవారం 24 పైసలు(0.3 శాతం) క్షీణించి 74.69 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా.. నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో రూపాయి 22 పైసలు(0.3 శాతం) బలహీనపడి 72.91ను తాకింది. ఇది చరిత్రాత్మక కనిష్టంకాగా.. ప్రస్తుతం 47 పైసలు పుంజుకుని 72.22 వద్ద ట్రేడవుతోంది. 

ఆర్‌బీఐ డాలర్ల విక్రయం
వరుసగా నాలుగో నెలలోనూ ఆర్‌బీఐ నికరంగా డాలర్లను విక్రయించింది. జులైలో స్పాట్‌ మార్కెట్లో 187 కోట్ల విలువైన డాలర్లను విక్రయించింది. ఇదే విధంగా జూన్‌లో 6.184 బిలియన్‌ డాలర్లు, మేలో 5.767 బిలియన్‌ డాలర్లు, ఏప్రిల్‌లో 2.483 బిలియన్‌ డాలర్లను ఆర్‌బీఐ విక్రయించినట్లు డేటా వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి మారకపు విలువ 14 శాతం ఆవిరైంది. గత నెల రోజుల్లో 6 శాతం కోల్పోగా.. గత 9 సెషన్లలోనే 4 శాతం క్షీణించింది. కాగా..  రూపాయి మారకపు విలువ 70 నుంచి 72కు 21 సెషన్లలోనే  నీరసించింది. ఆగస్ట్‌ 13న తొలిసారిగా 70 మార్క్‌ను తాకిన రూపాయి ప్రస్తుతం 73 సమీపానినిక బలహీనపడింది.Most Popular