యూరప్‌ ఒకే-ఆసియా మార్కెట్లు వీక్‌

యూరప్‌ ఒకే-ఆసియా మార్కెట్లు వీక్‌

దిగుమతి సుంకాల విధింపు అంశంలో ఏర్పడ్డ వివాద పరిష్కారాలకు సహకరించనందున అమెరికాపై ఆంక్షలు విధించాలంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)ను చైనా కోరింది. డంపింగ్‌ డ్యూటీల విషయంలో నిబంధనలు పాటించనందున ఏడాదికి 700 కోట్ల డాలర్ల విలువైన అమెరికా వాణిజ్యంపై ఆంక్షలు విధించాలంటూ తాజాగా చైనా డబ్ల్యూటీవోను డిమాండ్‌ చేసింది. కాగా.. గత శుక్రవారం చైనా మొత్తం దిగుమతులపై సుంకాలు విధిస్తామంటూ హెచ్చరించిన ట్రంప్‌ ప్రభుత్వం మంగళవారం మరోసారి చైనాతో కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. మరోపక్క అర్జెంటీనా, టర్కీలలో సంక్షోభాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.8 శాతం పుంజుకోగా.. జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ 0.5 శాతం ఎగసింది. ఈ బాటలో యూకే ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 0.15 శాతం లాభంతో ట్రేడవుతోంది. 
యూఎస్‌ లాభాల్లో
మంగళవారం టెక్నాలజీ, ఇంధన దిగ్గజాల అండతో అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో సింగపూర్‌ మినహా మిగిలిన మార్కెట్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. సింగపూర్‌ 0.65 శాతం పుంజుకోగా.. థాయ్‌లాండ్‌ 0.2 శాతం బలపడింది. మిగిలిన మార్కెట్లలో చైనా, ఇండొనేసియా, జపాన్‌, హాంకాంగ్‌, తైవాన్‌ 0.3 శాతం స్థాయిలో నష్టపోయాయి. దక్షిణ కొరియా నామమాత్ర నష్టంతో కదులుతోంది. 
హెర్మీస్‌, హెక్స్‌పాల్‌ జూమ్‌
ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మార్జిన్లు బలపడటంతో హెర్మీస్‌, యూఎస్‌ రబ్బర్‌ సంస్థ కిర్‌ఖిల్‌ను కొనుగోలు చేయనున్న వార్తలతో హెక్స్‌పాల్‌  3 శాతం చొప్పున ఎగశాయి. అయితే ద్వితీయార్థం లాభాలు క్షీణించనున్న అంచనాలు వెల్లడించడంతో ఎస్‌ఎస్‌ఈ 8 శాతం పతనమైంది.
డాలరు డీలా
మార్చి మొదలు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో 8 శాతం ర్యాలీ చేసిన డాలరు ప్రస్తుతం 0.15 శాతం బలపడింది. 95.12కు చేరింది. మరోపక్క జపనీస్‌ యెన్‌ 111.50కు బలహీనపడగా..  యూరో స్వల్ప వెనకడుగుతో 1.159 వద్ద కదులుతోంది. చైనీస్‌ యువాన్‌ 6.87 వద్ద ట్రేడవుతోంది.

 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');