ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ దన్ను-మార్కెట్ల దూకుడు

ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ దన్ను-మార్కెట్ల దూకుడు

తీవ్ర ఊగిసలాటకు లోనవుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం జోరందుకున్నాయి. సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. 258 పాయింట్లు జంప్‌చేసి 37,672కు చేరింది. నిఫ్టీ 74 పాయింట్లు బలపడి 11,362 వద్ద ట్రేడవుతోంది. రెండు రోజుల భారీ నష్టాల తరువాత సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు పలుమార్లు లాభనష్టాలను చవిచూసినప్పటికీ మిడ్‌సెషన్‌లో ఊపందుకున్న కొనుగోళ్ల కారణంగా దూకుడు చూపుతున్నాయి. కాగా.. అమెరికా, చైనా వాణిజ్య వివాదాలూ, డాలరుతో మారకంలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే రూపాయి సరికొత్త కనిష్టానికి చేరడం వంటి అంశాలు తొలుత ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు. 

రియల్టీ వీక్
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ 2 శాతం జంప్‌చేయగా.. మెటల్‌, ఫార్మా 1 శాతం చొప్పున ఎగశాయి. ఐటీ 0.5 శాతం పుంజుకోగా.. రియల్టీ 1.2 శాతం నీరసించింది. ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ 0.4 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో సన్‌ ఫార్మా, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌యూఎల్‌, హిందాల్కో, గ్రాసిమ్‌, వేదాంతా, యూపీఎల్‌, లుపిన్‌ 3.4-2 శాతం మధ్య ఎగశాయి. అయితే బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, టాటా మోటార్స్‌, ఐవోసీ, ఇన్‌ఫ్రాటెల్‌, యాక్సిస్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, కోల్‌ ఇండియా, ఇండస్‌ఇండ్జీ 2-1 శాతం మధ్య క్షీణించాయి. 
ఎఫ్‌ఎంసీజీ జూమ్‌
ఎఫ్‌ఎంసీజీ కౌంటర్లలో టాటా గ్లోబల్‌, డాబర్‌, మారికో, జీఎస్‌కే కన్జూమర్‌, పీఅండ్‌జీ, బ్రిటానియా, కాల్గేట్‌ పామోలివ్‌, యూబీఎల్‌ 2.6-1.2 శాతం మధ్య పెరిగాయి. అయితే రియల్టీ కౌంటర్లలో యూనిటెక్‌ 9.3 శాతం పతనంకాగా.. ఫీనిక్స్‌, హెచ్‌డీఐఎల్‌, ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌, శోభా, బ్రిగేడ్‌ 3-1 శాతం మధ్య నష్టపోయాయి. 
చిన్న షేర్లు వీక్
ఆటుపోట్ల మార్కెట్లో చిన్న షేర్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. ప్రస్తుతం బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.3 శాతం బలపడగా, స్మాల్‌ క్యాప్‌ 0.5 శాతం బలహీనపడింది. అయితే ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1608 నష్టపోగా.. 922 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');