HDFC లైఫ్‌కి కొత్త బాస్ విభా పదాల్కర్ ....

HDFC లైఫ్‌కి కొత్త బాస్ విభా పదాల్కర్ ....

HDFC స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి అమితాబ్ చౌధరీ రాజీనామా తరువాత ఆ కంపెనీకి కాబోయే సీఈఓ ఎవరనే సందేహానికి చెక్ పడింది. ఈ రోజు జరిగిన HDFC బోర్డు మీటింగ్‌లో ఆ కంపెనీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్‌ ఫైనాన్షియల్ ఆఫీసర్ విభా పదాల్కర్‌ను కంపెనీ సీఈఓగా ఎన్నుకున్నారు. అమితాబ్ చౌదరి యాక్సిస్ బ్యాంక్‌కు వెళ్ళిన విషయం విదితమే.  MD & CEOగా విభా నియమితులయ్యారని...HDFC కంపెనీ తెలిపింది. కాగా విభా పదాల్కర్ 2008 నుండి HDFCలో పనిచేస్తున్నారు. ఫైనాన్స్, లీగల్, ఇంటర్నల్ ఆడిట్  , రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఆమె అద్వితీయమైన పనితీరును కనబరిచారు. HDFCలోకి రాక ముందు ఆమె WNS గ్లోబల్ సర్వీసెస్, కోల్గేట్ పామోలివ్ , ప్రైస్ వాటర్ కూపర్ కంపెనీల్లో పనిచేశారు. ఇంగ్లాండ్&వేల్స్ ఛార్టెడ్ ఎకౌంటెంట్స్ సమాఖ్యలో సభ్యురాలైన విభా , మన దేశపు ఛార్టెడ్ ఎకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ లో కూడా సభ్యురాలుగా ఉండటం గమనార్హం. HDFCలో మ్యాక్స్ లైఫ్‌ ఇన్సూరెన్స్ విలీనం కావడంలో కీలక పాత్ర పోషించారు విభా. ప్రస్తుతం HDFC లైఫ్ దేశంలోనే అత్యంత విలువైన ఇన్సూరెన్స్ కంపెనీగా దాదాపు 90,704.54 కోట్ల రూపాయిల మార్కెట్ విలువ గల కంపెనీగా నిలిచింది.



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');