బ్యాంక్స్‌, రియల్టీ వీక్‌-ఎఫ్‌ఎంసీజీ, ఐటీ ప్లస్‌!

బ్యాంక్స్‌, రియల్టీ వీక్‌-ఎఫ్‌ఎంసీజీ, ఐటీ ప్లస్‌!

రెండు రోజుల భారీ నష్టాల తరువాత సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు లోనవుతున్నాయి. పలుమార్లు లాభనష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది. 116 పాయింట్లు ఎగసి 37,529కు చేరింది. నిఫ్టీ 25 పాయింట్లు బలపడి 11,313ను తాకింది. కాగా.. అమెరికా, చైనా వాణిజ్య వివాదాలూ, డాలరుతో మారకంలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే రూపాయి సరికొత్త కనిష్టానికి చేరడం వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు ప్రపంచ మార్కెట్లు అటూఇటుగా ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. 

రియల్టీ వీక్
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ 1.6 శాతం పుంజుకోగా.. రియల్టీ అదే స్థాయిలో నీరసించింది. ఐటీ 0.5 శాతం బలపడగా.. మీడియా, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ 1-0.4 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ, విప్రో, సన్‌ ఫార్మా, కొటక్‌ బ్యాంక్‌, హిందాల్కో, వేదాంతా, ఓఎన్‌జీసీ 2.3-1.2 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, బీపీసీఎల్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌,  టైటన్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ, హీరోమోటో, జీ 3.2-1.3 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ షేర్లలో యూనిటెక్‌, హెచ్‌డీఐఎల్‌, ఇండియాబుల్స్‌, ఫీనిక్స్‌, బ్రిగేడ్‌, ఒబెరాయ్‌, శోభా, ప్రెస్టేజ్‌, డీఎల్‌ఎఫ్‌ 5-1 శాతం మధ్య పతనమయ్యాయి.
ఎఫ్‌అండ్‌వోలో ఎఫ్‌ఎంసీజీ
డెరివేటివ్స్‌లో నెస్లే, మారికో, డాబర్‌, బాష్‌, ఎన్‌ఎండీసీ, హెక్సావేర్‌, యూబీఎల్‌ 4-2 శాతం మధ్య జంప్‌చేయగా.. గ్రాన్యూల్స్‌, జేపీ, మణప్పురం, బీవోబీ, రిలయన్స్‌ కేపిటల్‌, ఆర్‌ఈసీ, శ్రేఈ ఇన్‌ఫ్రా, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, రిలయన్స్ ఇన్‌ఫ్రా 6-3.5 శాతం మధ్య పతనమయ్యాయి.
చిన్న షేర్లు వీక్‌
ఆటుపోట్ల మార్కెట్లో చిన్న షేర్లలో అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.75 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1402 నష్టపోగా.. 809 లాభాలతో కదులుతున్నాయి.Most Popular